Chiranjeevi: ‘కాకా’ కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు చిరంజీవి. స్వశక్తితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఫైనల్‌గా మెగాస్టార్‌గా వెలుగొందుతున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ‘కాకా’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి హిట్ అందుకోవాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నాడు. ఈ సంవత్సరం అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు, సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు.
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో పెద్దగా సక్సెస్‌లను సాధించలేకపోతున్నాడు. ‘ఖైదీ నెంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’, ‘మన శంకర వరప్రసాద్’ మూవీస్‌ను మినహాయిస్తే మిగిలిన సినిమాలతో సక్సెస్‌లను సాధించలేకపోయాడు. మిగతా సీనియర్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్ మాత్రం వరుసగా విజయాలను అందుకున్నారు. బాలయ్య ‘అఖండ’, ‘భగవంత్ కేసరి’, ‘వీర సింహ రెడ్డి’, ‘డాకు మహారాజ్’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు.
Also Read
- Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో 'మష్రూమ్ పులావ్'..!
- Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
- Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే 'మసాలా పన్నీర్ పరాటా' ఇలా చేసుకోండి..!
అలాగే వెంకటేష్ సైతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను నమోదు చేసుకున్నాడు. రీసెంట్గా త్రివిక్రమ్‌తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’తో ఓకే అనిపించాడు. అందుకే చిరంజీవి సైతం ‘కాకా’ మూవీతో భారీ విజయాన్ని సాధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు చిరంజీవి వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత ప్రజా రాజ్యం పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఇమడలేక ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాడు. మొత్తానికైతే ఇప్పుడు కూడా చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతుండడం విశేషం.
తాజావార్తలు
-
Chiranjeevi: ‘కాకా’ కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. ఆస్తుల విచారణపై అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రద్దు!
-
Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో ‘మష్రూమ్ పులావ్’..!
-
Hardik Pandya: ‘చివరికి, ఆమె నాది’.. మహికా శర్మకు రింగ్ తొడిగిన హార్దిక్ పాండ్యా?.. నిశ్చితార్థంపై జోరుగా ప్రచారం
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
ట్రెండింగ్
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!