Chiranjeevi: ‘కాకా’ కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు చిరంజీవి. స్వశక్తితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఫైనల్‌గా మెగాస్టార్‌గా వెలుగొందుతున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో ‘కాకా’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి హిట్ అందుకోవాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నాడు. ఈ సంవత్సరం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు, సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు.

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో పెద్దగా సక్సెస్‌లను సాధించలేకపోతున్నాడు. ‘ఖైదీ నెంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’, ‘మన శంకర వరప్రసాద్’ మూవీస్‌ను మినహాయిస్తే మిగిలిన సినిమాలతో సక్సెస్‌లను సాధించలేకపోయాడు. మిగతా సీనియర్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్ మాత్రం వరుసగా విజయాలను అందుకున్నారు. బాలయ్య ‘అఖండ’, ‘భగవంత్ కేసరి’, ‘వీర సింహ రెడ్డి’, ‘డాకు మహారాజ్’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు.

అలాగే వెంకటేష్ సైతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను నమోదు చేసుకున్నాడు. రీసెంట్‌గా త్రివిక్రమ్‌తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’తో ఓకే అనిపించాడు. అందుకే చిరంజీవి సైతం ‘కాకా’ మూవీతో భారీ విజయాన్ని సాధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు చిరంజీవి వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత ప్రజా రాజ్యం పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఇమడలేక ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాడు. మొత్తానికైతే ఇప్పుడు కూడా చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతుండడం విశేషం.