NTV Telugu Site icon

Man Cut His wife Into Pieces : భార్యను ముక్కలుగా నరికి కాల్వలో పడేసిన భర్త

murder

murder

Man Cut His wife Into Pieces : తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను రెండు ముక్కలు చేసి కాల్వలో పడేశాడో కీచక భర్త. ఈ సంఘటన సిలిగురి సబ్ డివిజన్‌లోని ఫన్‌సీదేవస్ గోవల్తులి మలుపు వద్ద జరిగింది. మృతురాలి పేరు రేణుకా ఖాతున్.. వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త మహ్మద్ అన్సారుల్ తన భార్యను హత్య చేశాడు. అనంతరం రేణుక మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికేశాడు. ముక్కలను తీసుకెళ్లి తీస్తా కెనాల్‌లో పడేశాడు. గురువారం ఉదయం నుంచి తీస్తా కెనాల్‌లో రేణుక మృతదేహం కోసం పోలీసు బృందాలు గాలించాయి.

Read Also: Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుక సిలిగురి ప్రాంతంలోని ఓ కళాశాలలో బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తుంది. డిసెంబర్ చివరి వారం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. రేణుక కుటుంబ సభ్యులు డిసెంబర్ 24న సిలిగురి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్సారుల్ ను విచారించగా సంచలన సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ 24న అన్సరుల్ తన భార్యను హత్య చేసినట్లు దర్యాప్తులో ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి పక్కనే ఉన్న తీస్తా కెనాల్‌లో పడేశానని చెప్పాడు.

Read Also: Prince Harry : మా అన్న నన్ను పడేసి తన్నాడు.. అందుకే నడుం నొప్పి వచ్చింది

మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుకకు అన్సరుల్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. సిలిగురిలోని వార్డు నంబర్ 43లోని దాదాభాయ్ కాలనీలో నివాసం ఉండేవాడు. ఈ జంటకు మొదట్లో కొన్ని విభేదాలున్నాయని, అయితే ఆ తర్వాత వాటిని పరిష్కరించుకున్నారని రేణుక కుటుంబం పేర్కొంది. అప్పటి నుంచి అంతా బాగానే ఉంది.

Read Also: Viral : సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తోన్న ఆరేళ్ల క్యాన్సర్ చిన్నారి కథనం

ఈ ఘటనకు సంబంధించి సిలిగురి పోలీస్ కమిషనర్ అఖిలేష్ చతుర్వేది మాట్లాడుతూ, డిసెంబర్ 24న సిలిగురి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. ఖాతున్‌ను హత్య చేసినట్లు అన్సరుల్ అంగీకరించాడని… మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి తీస్తా కాలువలో పడేశారని తెలిపాడు. అరెస్టు చేసిన అన్సరుల్ను గురువారం సిలిగురి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన సమాచారం తెలియడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Show comments