Site icon NTV Telugu

Fraud Doctor : వైద్యం పేరుతో యువకులకు వల వేస్తున్న వైద్యుడు

Rmp Doctors

Rmp Doctors

పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ యువకులను మాయ మాటలతో లోబర్చుకుని హోమో సెక్స్ కు పాల్పడుతున్న వైద్యుడు డాక్టర్ జవ్వాద్ అలి ఖాజాపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వైద్యుని భార్య అంజుమ్ బేగం విజ్ఞప్తి చేశారు. మౌలాలికి చెందిన డాక్టర్ జవ్వాద్ అలి ఖాజాతో తనకు 2014లో వివాహం జరిగిందని, తమకు ఇద్దరూ పిల్లలు ఉన్నారని ఆమె తెలిపారు. వివాహ సమయంలో తమ తల్లిదండ్రులు జవ్వాద్ కు కట్నకానుకల కింద 25 లక్షల నగదు, 30 తులాల బంగారం ఇవ్వడం జరిగిందన్నారు. అంతలోనే తమ అత్తింటివారు పుట్టింటి నుంచి అధిక కట్నం తీసుకురావాలని వేదింపులకు గురిచేశారని, అయినప్పటికి తన వైవాహిక జీవితం, పిల్లల భవిష్యత్తు కోసం అన్ని వేదింపులు భరించానని ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు.

2023 ఫిబ్రవరి 20న తన భర్త ఇంట్లో సిసి కెమెరాలను ఆపివేసి పారిపోయాడని, దీంతో తమ ఇంటిపై అంతస్తులో అద్దెకు ఉంటున్న విష్ణువర్ధన్ రెడ్డి అనే విద్యార్థి తన భర్త గురించి అడగడం జరిగిందని, ఒక గంట తరువాత ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు సుసైడ్ లేఖలో జావ్వాద్ తనని లైంగీకంగా వేధింపులకు పాల్పడ్డారని పేర్కొనడం జరిగిందన్నారు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జవ్వాద్ తనకు ఉన్న పరిచయాలతో పోలీసులతో కుమ్ముకైయి పరారయ్యారని ఆమె ఆరోపించారు. తెలంగాణ నుంచి పారిపోయి ప్రస్తుతం హర్యానాలో డాక్టర్ వృత్తి నిర్వహిస్తూ…అక్కడ కూడా వైద్యం పేరుతో యువకులను బ్లాక్ మెయిల్ చేస్తు హోమో సెక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. వైద్య వృత్తిలో ఉంటూ యువతను లక్ష్యంగా పెట్టుకుని హోమో సెక్స్ కు పాల్పడుతున్న జవ్వాద్ పై ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించి తనకు, తన ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

Exit mobile version