భారతదేశంలో, అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీని కారణంగా చాలా రాష్ట్రాల్లో అబ్బాయిలు బ్యాచిలర్‌గా ఉన్నారు. ఎందుకంటే వారికి పెళ్లికి అమ్మాయిలు దొరకడం లేదు. అయితే భారతదేశంలోని ఓ ప్రాంతంలో భార్యలను అద్దెకు తీసుకోవచ్చని మీకు తెలుసా? అద్దెకు తీసుకునే మహిళల్లో వివాహం కాని వారు కూడా ఉంటారు. అగ్రిమెంట్ కూడా ఉంటుంది. రూ.10 నుంచి రూ.100 వరకు స్టాంపు పేపర్లపై ఈ అగ్రిమెంట్ చేస్తారు.
READ MORE: Vizag: సాగర్ తీరంలో నకిలీ ఐఏఎస్ హల్‌చల్.. కిలాడీ లేడి ఆటకట్టించిన పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఈ మహిళల సంత జరుగుతుంది. ధడీచా పేరుతో ఈ తిరోగమన ఆచారం కొనసాగుతోంది. ఈ సంతలో యువతులు, మహిళలను అద్దెకు ఇస్తారు. ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో ఈ సంత జరుగుతుంది. స్త్రీలను, అమ్మాయిలను కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి పురుషులు వస్తారు. నెలలు, సంవత్సరాల వరకు కూడా అద్దెకు తీసుకుంటారు. ఆమె కుటుంబ సభ్యులు, అద్దెకు తీసుకునేవారు స్టాంపు పేపర్లపై ఒప్పందం చేసుకుంటారు.
READ MORE: Minister Lokesh: క్యాన్సర్ చికిత్సలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రితో కలిసి పనిచేయండి..
పెళ్లి చేసుకోవడానికి తగిన యువతి దొరకనివారు, తమ ఇళ్లలోని వయోవృద్ధుల సంరక్షణ కోసం మహిళలు అవసరమైనవారు ఈ విధంగా ఒప్పందాలు చేసుకుంటారట. అందమైన మహిళలకు వేళం కూడా నిర్వహిస్తాని.. అద్దె రూ.15,000 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. కొందరు వేలంలో లక్షల రూపాయల వరకు పలుకుతారని వార్తా కథనాలు చెబుతున్నాయి. కన్యలకు ఎక్కువ ధర ఉంటుందని సమాచారం. అయితే.. ఒప్పందాన్ని ఉల్లంఘించే పూర్తి హక్కు ఆ మహిళలకు ఉంటుందని నిబంధలు ఉన్నాయి. ఆమె సంబంధంలో సంతోషంగా లేకున్నా, మరేదైనా కారణాల వల్ల ఈ ఒప్పందాన్ని మధ్యలోనే తెంచుకోవచ్చు. వాళ్లు రాసుకునే బాండ్ కాగితాలపై ఈ పాయింట్‌ను కూడా ఉంచుతారట.