NTV Telugu Site icon

రేపు అల్పపీడనం… తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాతావ‌ర‌ణంలో మార్పులు చోటు చేసుకోవ‌డంతో పాటు రుతుప‌వ‌నాలు చురుగ్గా సాగుతుండ‌టంతో జోరుగా వానలు పడుతున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు దంచికొట్టే ఛాన్స్ ఉంది. అలాగే అతిభారీ వర్షాలతో కొన్ని జిల్లాలు అతలాకుతలం అయ్యే అవకాశాలున్నాయని చెప్పింది ఐఎండీ.

read also : జులై 13, మంగళవారం దినఫలాలు

దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాగాలు సిద్ధంగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. ఇక హైదరాబాద్‌లో ముసురు కమ్మేసింది. పలుచోట్ల ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే రెండు రోజులుగా కురుస్తున్న వానలకు చాలా కాలనీలు నీళ్లలో నానుతున్నాయి. నగర శివారులోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

మూసీ పరివాహక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. న‌గ‌రంలో ఈ ఏడాది జులై 20 నాటికి సాధార‌ణ కంటే 70 శాతం అత్యధిక వ‌ర్షపాతం న‌మోదైంది. ఇక జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు