వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘400’ స్కోర్. 2004లో ఇంగ్లండ్‌పై లారా 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 21 ఏళ్లుగా టెస్టుల్లో ఆ రికార్డు పదిలంగా ఉంది. చాలా మంది ప్లేయర్స్ 400 చేరువకు వచ్చి.. ఔట్ అయ్యారు. ఇన్నాళ్లకు లారా వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టే ఛాన్స్ దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్‌కు వచ్చింది. అయితే అతడు 400 వద్దనుకోవడంతో లారా ప్రపంచ రికార్డు సేఫ్‌గా ఉంది.
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరుగుతోంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా 626/5 వద్ద డిక్లేర్ చేసింది. ప్రొటీస్ కెప్టెన్ వియాన్ ముల్డర్ (367 నాటౌట్; 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లు) ట్రిపుల్ సెంచరీ చేశాడు. ముల్డర్ మరో 34 రన్స్ చేస్తే.. బ్రియాన్ లారా ప్రపంచ రికార్డు 400 స్కోరును బ్రేక్ చేసేవాడు. టెస్టుల్లో వరల్డ్ రికార్డ్బ్రేక్ అయ్యే అవకాశం ఉన్నా.. ముల్డర్ వద్దనుకున్నాడు. తనకు రికార్డు కన్నా.. జట్టు ప్రయోజనమే ముఖ్యమని భావించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తానే కెప్టెన్ అయి ఉండి.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. క్రికెట్ ఫాన్స్ ముల్డర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: DPL 2025 Auction: డీపీఎల్ వేలంలో కోహ్లీ, సెహ్వాగ్ కుమారులు.. ఎంత పలికారో తెలుసా?
వరల్డ్ రికార్డ్ మిస్ అయినా వియాన్ ముల్డర్ ఓ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 297 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ముల్డర్.. టెస్టుల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కెప్టెన్సీ అరంగేట్రంలోనే 300 రన్స్ చేసిన తొలి సారథిగా రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్స్ చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు ఆషీమ్ ఆమ్లా (311) పేరిట ఉంది.
