WI vs AUS: వెస్టిండీస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు తీయడంతో వెస్టిండీస్ బౌలర్లు మ్యాచ్ పై పట్టుపట్టారు.
Read Also:IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్
ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో శ్యాం కాన్స్టాస్ (25), ఉస్మాన్ ఖవాజా (16) లు కాస్త మంచి శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ.. మధ్యలో స్మిత్ (3), గ్రీన్ (26), హెడ్స్ (29) త్వరగా వెనుదిరిగారు. అయితే బ్యూ వెబ్‌స్టర్ (60), అలెక్స్ కేరీ (63)లు హాఫ్ సెంచరీలతో మంచి సహకారం అందించి స్కోరు బోర్డును ముందుకు నడిపారు. దీనితో ఆస్ట్రేలియా మొత్తం 66.5 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
Read Also:JNTU-H: JNTU హైదరాబాద్ బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం.. R25 నిబంధనలపై కీలక నిర్ణయాలు..!
ఇక వెస్టిండీస్ బౌలింగ్ విషయానికి వస్తే.. అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు తీసి ఆసీస్ పతనానికి కారకుడయ్యాడు. ఇక జోసెఫ్ కు తోడుగా.. జేడెన్ సీల్స్ 2 వికెట్లు, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జస్టిన్ గ్రీవ్స్ చెరో వికెట్ తీసారు. ఇక వెస్టిండీస్ బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉంది.
