Site icon NTV Telugu

Alcohol Sprinkling: మద్యం తాగే ముందు చేసే ఈ చిన్న పనికి ఎంత పెద్ద అర్థం ఉందో తెలుసా..?

Alcohol Sprinkling

Alcohol Sprinkling

Alcohol Sprinkling: మందు తాగే చాలా మంది వాళ్లకు తెలియకుండానే చేసే ఒక చిన్న పనికి ఎంత పెద్ద అర్థం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తాగే ముందు గ్లాసు నుంచి కొన్ని చుక్కల మద్యం నేలపై చిమ్మేవారిని చాలా మందిని చూస్తుంటాం. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికి తాగే ముందు గ్లాసు నుంచి మద్యం చిమ్మే ఆచారం ఉంది. ఆసక్తికరంగా ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం అయ్యింది కాదు. వివిధ సంస్కృతులు, దేశాలు మద్యం గురించి అనేక కథలను, ఆసక్తికరమైన సంప్రదాయాలను కలిగి ఉన్నాయి. భారతదేశంతో సహా అనేక దేశాలలో, ప్రజలు మద్యం తాగే ముందు మూడు చుక్కల మద్యం ఎందుకు నేలపై ఎందుకు చల్లుతారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Off The Record: అంబటి రాంబాబు మీద డస్ట్ బిన్ బాంబ్ పడబోతుందా? జైలుకు పంపబోతున్నారా?

వాస్తవానికి తాగే ముందు మద్యం చుక్కలు చల్లుకునే సంప్రదాయం భారతదేశానికే పరిమితం కాదు. ఈ ఆచారం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో బలంగా ఉంది. ఈ సంప్రదాయాన్ని లిబేషన్ అంటారు. ఈ లిబరేషన్‌ అనే పదానికి కేంబ్రిడ్జ్ నిఘంటువు ఈ విధంగా అర్థాన్ని వివరిస్తుంది. నిఘంటువు ప్రకారం.. లిబేషన్ అంటే దేవత లేదా మరణించిన వ్యక్తి గౌరవార్థం చల్లిన లేదా తాగిన వైన్ అని అర్థం. ఈ ఆచారం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, వైన్ చల్లడం ద్వారా ఒకరి కుటుంబం, ఆ పరిసరాల శ్రేయస్సు కోసం ప్రార్థించడం అని వెల్లడించింది.

భారతదేశంలో దేవతలకు మద్యం నైవేద్యం పెట్టడం ఒక సంప్రదాయంగా ఉంది. పురాణాల ప్రకారం దేవతలకు అన్ని తాంత్రిక శక్తులను నియంత్రించే శక్తి ఉంది. మద్యం చల్లడం అనేది ఒక వ్యక్తి మనస్సును జాగ్రత్తగా చూసుకుని, వారిని చెడు నుంచి రక్షించమని ప్రార్థనగా పరిగణిస్తారు. ఈ విధంగా దేశంలో మద్యం తాగే ముందు నేలపై చల్లడం అనేది ఒక ఆచారంగా మారింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా తాగే ముందు మద్యం నేలపై చల్లడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఈ సంప్రదాయం కేవలం భారతదేశంలోనే కాకుండా, ఈజిప్ట్, గ్రీస్, రోమ్‌లలో కూడా ఉంది. ఇలా చేయడం ద్వారా మనతో లేని వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని, అవి నేలపై చల్లిన మద్యాన్ని గుర్తిస్తాయని నమ్ముతారు. ఇలాంటి పద్ధతిని క్యూబా, బ్రెజిల్‌లలో కూడా ఆచరిస్తారు. ఆయా దేశాలలో దీనిని పారా లాస్ శాంటోస్ అని పిలుస్తారు. అంటే “సెయింట్స్ కోసం” అని అర్థం. ఫిలిప్పీన్స్‌లో దీనిని పారా సా యావా అంటారు. దీని అర్థం వైన్‌లో కొంత భాగం దెయ్యానికి అంకితం చేసినట్లు.

చాలా దేశాలలో తాగే ముందు నేలపై కొన్ని చుక్కల మద్యం చల్లుకోవడం వల్ల చెడు దృష్టి లేదా ప్రతికూలత తొలగిపోతుందని ఒక నమ్మకం ఉంది. ప్రతికూలత దగ్గరకు రాకపోతే ప్రతిదీ శుభప్రదంగా, మంచిగా ఉంటుందని చాలా మంది విశ్వాసం. ఈ ఆచారం కేవలం నమ్మకాలకే పరిమితం కాదు. చాలా కుటుంబాలలో, ఇది ఇప్పటికి కొనసాగుతుంది, అలాగే తరువాతి తరాలకు కూడా సంక్రమిస్తుంది. వాస్తవానికి మద్యం తాగే వారిలో ఇది ఒక అలవాటు లేదా కుటుంబ సంప్రదాయంగా మారింది.

READ ALSO: Leopard Poachers Arrested: వేటగాళ్లను పట్టిచ్చిన సోషల్ మీడియా..

Exit mobile version