Gaganyaan Test Flight: చివరి నిమిషంలో నిలిచిపోయిన గగన్‌యాన్ టీవీ-డీ1 ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaganyaan Test Flight: గగన్‌యాన్ టీవీ-డీ1 ప్రయోగం వాయిదా పడింది.. చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది ఇస్రో.. గగన్‌యాన్ మిషన్ రాకెట్ ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో ఆ ప్రయోగాన్ని వాయిదా వేశారు. కౌంట్‌డౌన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం టీవీ-డీ1 ప్రయోగించాల్సి ఉన్నా.. మొదట ఆ ప్రయోగాన్ని ఉదయం 8.30 గంటలకు వాయిదా వేసింది ఇస్రో.. ఆ తర్వాత ఉదయం 8.45 గంటలకు వాయిదా పడింది.. కానీ, ఆటోమెటిక్ లాంచ్ సీక్వెన్స్‌లో లోపం ఉన్నట్లు కంప్యూటర్లు చెప్పడంతో ఆ పరీక్షను చివరి క్షణాల్లో ఇస్రో వాయిదా వేసింది. కౌంట్ డౌన్ కు 5 సెకండ్ల ముందు ఈ ప్రయోగాన్ని ఆపేశారు. సాంకేతిక సమస్యను పరిశీలించే పనిలో పడిపోయారు శాస్త్రవేత్తలు.
మొత్తంగా ఇస్రో చేపట్టిన గగన్ యాన్ క్రూ మాడ్యూల్ లో సాంకేతిక లోపాన్ని శాస్త్ర వేత్తలు గుర్తించారు.. ప్రయోగానికి 5 సెకండ్ల ముందు ప్రయోగం ఆపాలని కంప్యూటర్‌కు ఆదేశాలు వెళ్లాయి.. దీంతో. ప్రయోగం వాయిదా పడింది.. భూమి నుంచి 17 కిలో మీటర్ల ఎత్తుకు వెళ్లి కిందకు రావాల్సిన క్రూ మాడ్యూల్‌ను రద్దు చేశారు.. సాంకేతిక సమస్యపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ చర్చలు జరిపి.. ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.. లోపాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు..
Also Read
ఇక, ప్రయోగం వాయిదపై ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ మాట్లాడుతూ.. అనుకున్న విధంగా ఈరోజు ప్రయోగాన్ని చేయలేకపోయాం.. వాతావరణంలో మార్పుల వల్ల ప్రయోగాన్ని 8 గంటల 45 నిమిషాలకు వాయిదా వేశాం.. కానీ, సాంకేతికలోపం వల్ల ప్రయోగాన్ని నిలిపివేశాం అన్నారు. అయితే, రాకెట్ సురక్షితంగానే ఉంది.. సాంకేతిక సమస్యలను గుర్తించే ప్రక్రియలో నిమగ్నమయ్యాం అని వివరించారు.. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తాం.. అన్నీ విశ్లేషించిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం.. త్వరలోనే మళ్లీ ప్రయోగం చేస్తాం అని ప్రకటించారు ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్.
TV D1 Test Flight
Liftoff attempt couldn't be completed.
Updates will follow.
— ISRO (@isro) October 21, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు