NTV Telugu Site icon

Sriramnavami 2024 : శ్రీరామనవమి పండుగను ఎందుకు జరుపుకుంటారు? శాస్త్రీయ కారణాలు?

Sri Rama Navami 2016

Sri Rama Navami 2016

హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య రాముడు.. రాముడు ఏక పత్ని వ్రతుడు.. సత్యాన్ని, ధర్మాన్ని నమ్ముకొని ఉంటాడు.. రాముడంటే ఒక్కటే మాట, ఒక్కటే బాణం అంటారు.. ఇచ్చిన మాటను మరువడు.. ప్రతి ఏటా హిందువులంతా శ్రీరామనవమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాముడి పుట్టినరోజు అని కొందరు అంటారు.. మరికొందరు రాముడికి సీతకు కళ్యాణం జరిగిన రోజు అని నమ్ముతారు.. శ్రీరాముడికి, సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాదు.. ఈ విశిష్టమైన రోజునే 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైనట్లు ప్రజల విశ్వాసం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటారు.. శ్రీరామనవమి నాడు ప్రత్యేక పూజలను చెయ్యడం మాత్రమే కాదు.. రాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకంను కూడా పంచుతారు..

ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. స్వామివారి కల్యాణం తర్వాత తలంబ్రాలు, పసుపు, కుంకుమతో పాటుగా భక్తులకు పానకం, వడపప్పు అందిస్తారు. అంతేకాదు రామాయణాన్ని పారాయణ చేస్తారు. రాములవారి కల్యాణంతో దేశం సిరి, సంపదలతో తులతూగుతుందని భక్తుల విశ్వాసం.. రఘు వంశీయుల పాలననే రాముడు కూడా కొనసాగించాడు. అందుకే రామారాజ్యాంలా వర్ధిల్లాలని అందరు కోరుకుంటారు..