NTV Telugu Site icon

WPL 2023: వేలం అద్భుతంగా నిర్వహించింది: మల్లికా సాగర్‌పై ప్రశంసలు

3

3

సోమవారం నిర్వహించిన ఐపీఎల్ విమెన్స్ మొట్టమొదటి వేలం విజయవంతమైంది. ఐదు ఫ్రాంఛైజీలు రూ.59.5 కోట్లను వెచ్చించి 87 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాయి. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచింది. అయితే.. ఈ వేలం ప్రక్రియలో క్రికెటర్లతోపాటు మరో వ్యక్తి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమే.. వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్‌. ఆమె వేలం నిర్వహించిన తీరు అద్భుతమంటూ ఫ్యాన్స్‌తో పాటు చాలామంది ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ లిస్టులో చేరాడు వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు.

మల్లికా సాగర్

“మల్లికా సాగర్‌ అద్భుతమైన ఆక్షనీర్‌. చాలా స్పష్టంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో.. ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. WPLలో వేలానికి ఆమె సరైన ఎంపిక. వెల్‌డన్‌ బీసీసీఐ” అని కార్తీక్ ట్విట్టర్‌లో ఆమెకు కితాబిచ్చాడు. ముంబైకి చెందిన మల్లికా ఆర్ట్‌ కలెక్టర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఆర్ట్‌ ఇండియా కన్సల్టెంట్‌ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ప్రో కబడ్డీ లీగ్‌ వేలం ప్రక్రియకు నిర్వహకురాలిగా కూడా వ్యవహరించారు. ఇదే అనుభవంతో ఐపీఎల్ నిర్వాహకులు ఆమెకు ఈ అవకాశం ఇచ్చారు.

Also Read: Ishant Sharma: షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..ఇషాంత్ ఏమన్నాడంటే!