WHO: కరోనా మహమ్మారి కోరల్లో నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు భయాందోళనలను కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్‌వో గుడ్‌న్యూస్ చెప్పింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ జనాభాలో 90 శాతం మందిలో కొంత మేర రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నారని అంచనా వేసింది. వ్యాక్సినేషన్ కారణంగా ప్రపంచంలోని 90 శాతం మందిలో కొవిడ్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వచ్చినట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. కాకపోతే కొత్త వేరియంట్లు ఉద్భవించే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు.
కొవిడ్ మహమ్మారి ఎమర్జెన్సీ దశ ముగింపునకు వచ్చిందని.. కానీ వైరస్ ఇంకా తుడిచిపెట్టుకుపోలేదని టెడ్రోస్ హెచ్చరించారు. వైరస్‌పై నిఘా, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొనసాగుతున్న లోపాలతో కొత్త వేరియంట్ల కారణంగా మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు హెచ్చరించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఏడాది తర్వాత కూడా కొవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఓ పరిశోధన పేర్కొంది. దాని ఫలితంగా తరుచుగా బూస్టర్ డోస్‌లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించినట్లు తెలిపింది. కొత్త వేరియంట్‌గా ఒమిక్రాన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటి నుంచి గత వారాంతంలో ఒక సంవత్సరం గడిచిందని టెడ్రోస్ పేర్కొన్నారు. అప్పటి నుండి ఇది ప్రపంచమంతటా వ్యాపించింది. దాని ముందున్న డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ గణనీయంగా వ్యాప్తి చెందగలదని రుజువు చేసింది.
School Teacher Suspend: భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు స్కూల్ టీచర్ సస్పెండ్
కొవిడ్ బూస్టర్‌లపై అధ్యయనంలో ఫైజర్/బయోఎన్‌టెక్, మోడెర్నా ద్వారా వచ్చిన కొత్త వ్యాక్సిన్లు మెరుగైన రక్షణను అందించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. 360,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో ఈ మేరకు ప్రకటించింది. సెప్టెంబరులో యూఎస్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ బీఏ 4/5 స్ట్రెయిన్‌లు సోకిన 18-49 సంవత్సరాల వయస్సు గల యువకులకు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఏడాది తర్వాత కూడా కోవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఓ పరిశోధన పేర్కొంది. దాని ఫలితంగా తరుచుగా బూస్టర్ డోస్‌లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించినట్లు తెలిపింది.