దాదాపు బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఏటీఎం కార్డులను యూజ్ చేస్తున్నారు. అయితే డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డుల మాదిరిగా లోన్స్ ను అందించవు, కానీ మాల్స్, షాపింగ్ మాల్స్‌లో వాటిని ఉపయోగించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో నాలుగు రకాల డెబిట్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి వీసా, మాస్టర్ కార్డ్, రూపే, మాస్ట్రో. ఈ డిజిటల్ యుగంలో కాంటాక్ట్‌లెస్, వర్చువల్ డెబిట్ కార్డులు కూడా ట్రెండ్ అవుతున్నాయి. రుపే, వీసా, డెబిట్ కార్డులు అందించే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read:Bigg Boss 19 Winner: హిందీ బిగ్‌బాస్ విన్నర్‌గా గౌరవ్ ఖన్నా.. భారీగా ప్రైజ్‌మనీ, కారు..
వీసా, మాస్టర్ కార్డ్‌లను విదేశాలలో కూడా ఉపయోగించవచ్చు.
వీసా, మాస్టర్ కార్డ్ కార్డులను దేశీయంగా, విదేశాలలో ఉపయోగించవచ్చు. వీసా డెబిట్ కార్డులు భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మాస్టర్ కార్డ్ రెండవ స్థానంలో ఉంది. రెండు కార్డులు వినియోగదారులకు మెరుగైన భద్రతా ఫీచర్లను, బోనస్ రివార్డ్ పాయింట్లను అందిస్తాయి.
వీసా కార్డుల రకాలు
భారతదేశంలో వీసా కార్డులు.. వీసా క్లాసిక్, వీసా గోల్డ్, వీసా ప్లాటినం, వీసా సిగ్నేచర్, వీసా ఇన్ఫినిట్. ఈ కార్డులు ATM విత్ డ్రాలు, ఆన్‌లైన్ షాపింగ్, నగదు రహిత చెల్లింపులకు ఉపయోగపడతాయి.
రూపే కార్డు
RuPay భారత డెబిట్ కార్డుగా పాపులారిటీ పొందింది. ఇది NPCI ద్వారా సృష్టించబడిన భారత స్వంత చెల్లింపు నెట్‌వర్క్. ఇది తక్కువ ఛార్జీలను వసూలు చేస్తుంది.
మాస్ట్రో కార్డ్ ప్రయోజనాలు
మాస్ట్రో కార్డును 1991లో మాస్టర్ కార్డ్ ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చెల్లింపులు చేయవచ్చు.
Also Read:Kashmir: కశ్మీర్‌లో పట్టుబడిన చైనా జాతీయుడు.. ఫోన్ హిస్టరీలో షాకింగ్ సమాచారం!
డెబిట్ కార్డు తీసుకునే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి
డెబిట్ కార్డు తీసుకునే ముందు, కార్డుపై వార్షిక ఛార్జీలు, అంతర్జాతీయ లావాదేవీలకు సౌకర్యం ఉందా లేదా, ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే పరిమితి, గరిష్ట ఖర్చు పరిమితిని తెలుసుకోవడం ముఖ్యం.
