NTV Telugu Site icon

Naga Chaitanya : పెళ్లి తర్వాత ముంబైలో కాపురం పెట్టనున్న నాగచైతన్య, శోభిత ?

Sobitha Nagachaitanya Marriage

Sobitha Nagachaitanya Marriage

Naga Chaitanya : త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల.. వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లి పనులకు సంబంధించిన పనులు మొదలైనట్లుగా శోభిత కొన్ని ఫోటోలను సోమవారం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. శోభిత ఈ ఫోటోలను పంచుకుంటూ పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలైనట్లు తెలిపింది. వైజాగ్ లోని శోభిత స్వగృహంలో కార్యక్రమం జరిగింది. అనంత‌రం అదే రోజు సాయంత్రం శోభిత ముంబైకి వెళ్లిపోయింది. పెళ్లికి అంతా రెడీ అన్నట్లే కెమెరాల‌కు ఓ సిగ్నల్ ఇచ్చింది. ప‌సుపు దంచ‌డం…శోభిత సిగ్న‌ల్ రెండింట ఆధారంగా ముహూర్తం పెట్టిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చేది కార్తీక మాసం అది కూడా పెళ్లిళకు మంచి సీజ‌న్. కాబ‌ట్టి ఈ సీజ‌న్ లో చైతన్య-శోభిత‌ల పెళ్లి తేది ఫిక్స్ చేసి ఉండొచ్చు. ఆ సంగ‌తి పక్కన పెడితే వారి పెళ్లి తర్వాత కొత్త జంట కాపురం ఎక్క‌డ పెడుతుంది? అన్న‌ది ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు.

Read Also:Dharani Portal: ధరణి పోర్టల్‌ నిర్వహణ ఎన్‌ఐసీకి అప్పగించిన తెలంగాణ సర్కార్

ఎందుకంటే చైత‌న్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాబ‌ట్టి అత‌డు హైద‌రాబాద్ లోనే ఉండాలి. పైగా స్వస్థలం..ఇత‌ర బిజినెస్ వ్యవహారాలు కూడా ఆయన చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే చైత‌న్య హైదరాబాద్ వ‌దిలి బ‌య‌ట‌కు పెద్దగా వదిలిపెట్టడని అంటున్నారు. కానీ శోభిత మాత్రం తెలుగు సినిమాల కంటే ఆమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంటుంది. కాబట్టి ఆమె బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల‌కు ప్రమోట్ అయిన న‌టి. అలాగే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇలా శోభిత కెరీర్ ఎక్కువ‌గా ముంబైతో ముడిప‌డి ఉంది. చైతన్యను పెళ్లి చేసుకుని హైద‌రాబాద్ లో కాపురం పెడితే? ఆమె ముంబైకి తిర‌గాల్సి ఉంటుంది. అలా కాకుండా ముంబైలో కాపురం పెడితే నాగ‌చైత‌న్య హైద‌రాబాద్ కి తిర‌గాల్సి ఉంటుంది. ఇది కొంచె కష్టమే. ట‌ఫ్ మ‌రి వారిద్దరూ కొత్త కాపురం ఎక్కడ అన్నది మాత్రం త్వరలోనే తెలియనుంది.

Read Also:YS Jagan: ప్రేమోన్మాది చేతిలో బాలిక హత్య.. కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్..

ఇకపోతే, సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య – శోభితలు ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తిరిగిన కొన్ని ఫోటోలు ఇదివరకు బయటకు రావడంతో.. వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. మొత్తానికి వీటిని నిజమని నిరూపిస్తూ.. ఆగస్టు 8న నాగచైతన్య – శోభితల నిశ్చితార్థం జరిగింది. ఆ కార్యక్రమం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుక సంబంధించి ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Show comments