Site icon NTV Telugu

Rakshit Shetty : వేర్ ఈజ్ రక్షిత్ శెట్టి…? సినిమాలు ఎందుకు చేయడం లేదు

Rakshith Shetty

Rakshith Shetty

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిని ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. 777చార్లీతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్.. 2023లో వచ్చిన సప్త సాగారాలు దాచే ఎల్లో- బి తర్వాత కనిపించలేదు. పోనీ సినిమాలు లేవా అంటే అప్పటికే రిచర్డ్ ఆంటోనీ, పుణ్య కోటి లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ పంచుకోలేదు సరికదా.. మీడియా కంటికి కూడా కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ మిస్సింగ్ అంటూ పోస్టర్స్ వేసి తమ ఆవేదన తెలియజేశారు. అయినప్పటికీ స్పందించలేదు రక్షిత్.
Also Read : SEYON : శివ కార్తికేయన్ పుట్టినరోజు స్పెషల్.. ‘శేయోన్’ ట్రైలర్ రిలీజ్..

గ్యాప్ ఎక్కువైతే తనను పట్టించుకోరనుకున్నారేమో.. త్రీ ఇయర్స్ లెంతీ గ్యాప్ తర్వాత మళ్లీ మొహానికి మేకప్ వేసుకోబోతున్నాడట రక్షిత్. పాత ప్రాజెక్ట్స్ మళ్లీ పట్టాలెక్కిస్తున్నాడు. రిచర్డ్ ఆంటోనీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. మార్చి నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగబోతుందట. అలాగే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటునే.. విజువల్ వండర్‌గా తెరకెక్కించబోయే పుణ్యకోటి వీఎఫ్ఎక్స్ పనులు కూడా పర్యవేక్షించనున్నట్లు సమాచారం. తన ఫ్రెండ్ రిషబ్ శెట్టి పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతోన్న వేళ.. రక్షిత్ మాత్రం నిలకడగా నీళ్లు తాగేందుకే ప్రయత్నిస్తున్నాడు. చేసేది తక్కువ సినిమాలైనా కన్నడలో రక్షిత్ శెట్టికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్యాప్ లేకుండా రెగ్యులర్ గా సినిమాలు చేయాలని రక్షిత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఇప్పటి నుండైనా కంటిన్యూగా సినిమాలు చేస్తాడో లేక హిట్ కొట్టక మళ్ళి గ్యాప్ తీసుకుంటాడో చూడాలి.

Exit mobile version