Holi 2026: 2026లో హోలీ ఎప్పుడు జరుపుకుంటారు?.. మార్చి 3 లేదా 4వ తేదీనా?.. పూర్తి వివరాలు
- 2026లో హోలీ ఎప్పుడు జరుపుకుంటారు?
- మార్చి 3 లేదా 4వ తేదీనా?
- తెలుగు రాష్ట్రాల్లో దీన్ని కాముని పౌర్ణమి లేదా జాజిరి అని కూడా పిలుస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోలీ అనేది హిందువులలో అత్యంత ఆనందోత్సాహాలతో జరిగే పండుగ. దీన్ని “రంగుల పండుగ” అని కూడా పిలుస్తారు. శీతాకాలం ముగిసి వసంత ఋతువు రావడం, మంచి చెడుపై విజయం, ప్రేమ, స్నేహం, సమానత్వం వంటి భావాలను ఈ పండుగ సూచిస్తుంది. ఉదయం నుంచి రంగులు పూసుకోవడం, రంగుల నీళ్లు చల్లుకుంటూ చిన్నా పెద్ద అంతా కలిసి హోలీని జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని కాముని పౌర్ణమి లేదా జాజిరి అని కూడా పిలుస్తారు. అయితే 2026లో హోలీ ఎప్పుడు జరుపుకోవాలి అన్న సందిగ్ధంలో పడిపోయారు ప్రజలు. హోలీ మార్చి 3 లేదా 4వ తేదీనా జరుపుకోవాలా అన్న ఆలోచనలో పడిపోయారు. 2026 సంవత్సరంలో హోలీ పండుగ రెండు రోజులు జరుగుతుంది.. హోలికా దహనం మార్చి 3, 2026 (మంగళవారం) సాయంత్రం. ఇది చెడును సూచించే హోలికాసురుని దహనం చేసే ఆచారం. రాత్రి హోమం వేసి పూజ చేస్తారు.
Also Read:Ayesha Khan : అది నేను కాదు నమ్మకండి.. ఫేక్ అకౌంట్లపై ఆయేషా ఖాన్ ఫైర్..!
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్..
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
రంగుల హోలీ మార్చి 4, 2026 (బుధవారం) జరుపుకుంటారు. ఇదే ప్రధాన హోలీ రోజు. రంగులు, గులాల్, రంగుల నీళ్లు, భాంగ్, గీతాలు, నృత్యాలు, బాండ్లు విసిరే ఆటలతో జరుపుకుంటారు. ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2 సాయంత్రం 5:55 నుంచి మార్చి 3 సాయంత్రం 5:07 వరకు ఉంటుంది. అయితే మార్చి 3న చంద్రగ్రహణం ఉండటం వల్ల చాలా మంది పండితులు, ద్రిక్ పంచాంగం వంటి సోర్స్ ప్రకారం రంగుల హోలీని మార్చి 4నే జరుపుకోవాలని సూచిస్తున్నారు. కాబట్టి మీ ప్రాంత పంచాంగం లేదా స్థానిక ఆలయ పూజారి సలహా తీసుకోవడం మంచిది.
హోలీ వెనుక ప్రధాన కథలు
హిరణ్యకశిపుడు – ప్రహ్లాదుడు – హోలిక: హిరణ్యకశిపుడు తన సోదరి హోలికతో ప్రహ్లాదుని చంపాలని ప్రయత్నించాడు. కానీ భగవంతుడి భక్తి వల్ల హోలికే కాలిపోయింది. ఈ చెడు నాశనాన్ని సూచిస్తూ హోలికా దహనం చేస్తారు.
రాధా-కృష్ణుల హోలీ: బృందావనంలో శ్రీకృష్ణుడు రాధాతో రంగులాట ఆడాడట. అందుకే ఈ పండుగలో ప్రేమ, రంగులు ప్రధానం.
కామ దహనం: కొన్ని ప్రాంతాల్లో శివుడు మన్మథుని భస్మం చేసిన రోజుగా కూడా జరుపుకుంటారు (కాముని పౌర్ణమి).
తాజావార్తలు
-
India First Hydrogen Train: భారత్ తొలి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ సక్సెస్.. గంటకు 120 కిమీ వేగంతో పరుగులు
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్‌మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!