Site icon NTV Telugu

Shabbir Ali-Harish Rao: హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలి?: షబ్బీర్‌ అలీ

Shabbir Ali

Shabbir Ali

Shabbir Ali Comments on Harish Rao: రైతు రుణమాఫీపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హత లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో? చెప్పాలన్నారు. రుణమాఫీ చేయడం బీఆర్ఎస్‌కు ఇష్టం లేదని, అందుకే అవాకులు చెవాకులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డిలో కాంగ్రెస్ రైతుర్యాలీ నిర్వహించింది. రుణమాఫీ సంబరాల్లో భాగంగా రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి.

మాచారెడ్డిలో షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ… ‘రైతు రుణమాఫీపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హత లేదు. హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలి. రుణమాఫీ చేయడం బీఆర్ఎస్‌కు ఇష్టం లేదు. అందుకే అవాకులు చెవాకులు చేస్తున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ త్వరలో జిరో కాబోతుంది. బీఆర్ఎస్‌ నేతలకు రుణమాఫీ గైడ్ లైన్ తెలియకుండానే గతంలో రుణమాఫీ చేశారా?. ఇంటికి ఒక్క రుణమాఫీ అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్ఎస్‌ నేతల మాటలు నమ్మవద్దు. పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది. కాంగ్రెస్ రుణమాఫీ చేయదని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారం చేశారు. ఏకకాలంల రుణమాఫీ చేయడంతో ప్రతిపక్షాలకు మతి బ్రమించింది. రుణమాఫీకి కృతజ్ఞతగా రైతులతో వరంగల్‌లో రాహుల్ గాంధీతో భారీ సభ ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.

Also Read: Tamannaah Bhatia: తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్‌ నటుడు!

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ పంటరుణాల మాఫీ అసాధ్యమని ప్రతిపక్షాలు మాట్లాడినా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి మరీ గడువుకు ముందే మాటనిలబెట్టుకున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన 8 నెలల్లోనే అసాధ్యమన్న దాన్ని సుసాధ్యం చేశారు. నిన్న లక్ష్య వరకు రుణమాఫీ అయింది. దాంతో అధికార కాంగ్రెస్‌లో జోష్ నిండింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version