Site icon NTV Telugu

Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ అప్పుడేనా?

Mr Bachan

Mr Bachan

మాస్ మహారాజ రవితేజ ఒకపైపు ప్లాపులు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు.. గతంలో ధమాకా తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజులో హిట్ టాక్ అందుకోలేదు.. ఈసారి వచ్చే సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద రికార్డు లను అందుకోవాలని సరికొత్త కాన్సెఫ్ట్ తో రాబోతున్నాడు.. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రిమీక్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరాకెక్కిస్తున్నారు..

రవితేజ హరీష్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ ను మించిన కథతో రాబోతున్నాడు.. ఈ సినిమాకు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది.. ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. దాంతో సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమాను జూలై లో విడుదల చేసేందుకు చిత్రాయూనిట్ సన్నాహాలు చేస్తుంది..

ఇక ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్‌ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్‌ లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ పోజ్‌లో కనిపిస్తూ మాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అలాగే ‘మిస్టర్‌ బచ్చన్‌..నామ్‌ తో సునా హోగా’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా గ్రాండ్‌గా లాంఛ అయింది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బికి పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నారు.. మిక్కిజే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు..

Exit mobile version