NTV Telugu Site icon

WhatsAPP: వాట్సాప్‌ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..30 కాదు 100 పంపొచ్చు!

W

W

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ను కట్టిపడేస్తోంది. వినియోగదారుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ రోజురోజుకూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ఈ అప్‌డేట్‌తో ఒకేసారి 100 మీడియా పైల్స్‌ను షేర్ చేసే అవకాశం లభించనుంది. ఇంతకుముందు ఈ పరిమితి 30 వరకే ఉండేది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యాప్‌ను అప్ డేట్ చేసుకున్న ఆండ్రాయిడ్ 2.23.4.3 (android 2.23.4.3 version) వెర్షన్‌తో ఉన్న బీటా యూజర్లకు ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

Also Read: KL Rahul: టీమ్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే: రాహుల్

యూజర్లు ముందుగా, గూగుల్ ప్లే స్టోర్‌లోని వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్ డేట్ కావాలి. భవిష్యత్తులో మిగతా యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ నుంచి 30కి పైగా మీడియా ఫైల్స్‌ను షేర్ చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఈ ఫీచర్ అందుబాటులో ఉందో, లేదో యూజర్లు తెలుసుకోవచ్చు. ఒకవేళ 30కి పైగా మీడియా ఫైళ్లను ఒకేసారి, చాట్‌లో షేర్ చేయగలిగితే, ఆ వాట్సాప్ యూజర్‌కు 100 ఫైళ్ల వరకు షేర్ చేసే సదుపాయం ఉన్నట్లు భావించవచ్చు. ప్రతీసారి వేర్వేరుగా ఫోటోలు, లేదా మీడియా ఫైల్స్‌ను షేర్ చేయడానికి బదులుగా ఒకే క్లిక్‌తో మొత్తం అల్బమ్‌ను ఈ ఫీచర్ ద్వారా షేర్ చేయవచ్చు.

మరికొన్ని ఫీచర్లు..

ఇదే కాకుండా, మరికొన్ని కొత్త, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కూడా వాట్సాప్ సిద్ధం చేస్తోంది. ముఖ్యమైన చాట్స్‌ను సులభంగా గుర్తించేలా పిన్ చేసుకునే సదుపాయాన్ని మరింత విస్తరించింది. గ్రూప్ చాట్స్, వ్యక్తిగత చాట్స్‌లో ముఖ్యమైన సందేశాలను ఇకపై ప్రత్యేకంగా పిన్ చేసుకోవచ్చు. అయితే, ఇందుకు కూడా వాట్సాప్ యూజర్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్ డేట్ అయి ఉండాలి.

Also Read: Inflation in UK: యూకేలో భారతీయ విద్యార్థుల తిప్పలు.. ఖర్చుల కోసం ఎక్కువ సేపు పని..