Site icon NTV Telugu

WhatsApp: లక్షల మంది వాట్సాప్ ఖాతాలు బ్యాన్.. ఆ తప్పు చేస్తే మీది కూడా అంతే..

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్స్ ఎక్కువే.. వీడియో, ఆడియో కాల్స్ చేసుకొనే ఫెసిలిటీ కూడా ఉండటంతో ఎక్కువ మంది ఈ వాట్సాప్ ను వాడుతుంటారు.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు షేర్‌ చేసుకోవడానికి వాట్సాప్‌ని మొదటి ఆప్షన్‌గా భావిస్తారు.. అయితే వాట్సాప్ ను ఎక్కువగా వాడటంతో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి..

ఇకపోతే కొందరు వ్యక్తులు వాట్సాప్‌ను తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం, స్పామ్ మెసేజ్‌లు పంపడం లేదా ఇతరులను వేధించడం వంటి పనులను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇతర యూజర్లకు ఇబ్బంది కలిగించే అకౌంట్‌లను బ్యాన్ చేస్తుంది. ఇలా గతేడాది డిసెంబర్ నెలలో వాట్సాప్ ఏకంగా 69 లక్షల అకౌంట్లు బ్యాన్ చేసింది.. వాళ్లు ఇక ఎటువంటి మెసేజ్ లు చెయ్యలేరు.. చూడలేరు.. కాల్స్ కూడా చేసుకోలేరు..

కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తూ అకౌంట్ల బ్యాన్‌కు సంబంధించిన వివరాలను ప్రతి నెలా యూజర్-సేఫ్టీ రిపోర్ట్‌ రూపంలో షేర్ చేస్తుంటుంది. కొత్త ఐటీ నిబంధనలు వాట్సాప్ ప్రతి నెల ఎన్ని అకౌంట్లను బ్యాన్ చేస్తుందో, ఎందుకు బ్యాన్ చేస్తుందో ప్రభుత్వానికి తెలియజేయాలని చెబుతున్నాయి. ఈ రూల్స్ ప్రకారం..యూజర్లు లేదా ప్రభుత్వం నుంచి ఏవైనా ఫిర్యాదులు లేదా విజ్ఞప్తులకు వాట్సాప్ తప్పకుండా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది.. అయితే 16 లక్షల అకౌంట్స్ ను చెప్పకుండానే బ్యాన్ చేసింది.. వాట్సాప్‌కు వినియోగదారుల నుంచి రికార్డు స్థాయిలో ఫిర్యాదులు కూడా అందాయి. అకౌంట్‌ నిషేధాలు, ప్రైవసీ, భద్రత లేదా దుర్వినియోగం వంటి విభిన్న సమస్యల గురించి వాట్సాప్ 16,000 కంటే ఎక్కువ ఫిర్యాదులను అందుకుంది.. వాట్సాప్ దుర్వినియోగాన్ని నిరోధించిండానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది..

Exit mobile version