NTV Telugu Site icon

WhatsApp: ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో వాట్సాప్ ఇక పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Whatsapp

Whatsapp

WhatsApp Is Not Working These Android And IPhone Check Full List in Telugu: మెటా గొడుగు కింద పనిచేస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనేక ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ పరికరాలలో తమ యాప్ పని చేయడం ఆపివేస్తున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 24, 2023 నుండి ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, పాత వెర్షన్ మరియు iOS 10 -iOS 11 నడుస్తున్న స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ మద్దతు ఇవ్వడం ఆపివేసింది. అంటే ఈ పాత OS వెర్షన్‌లలో నడుస్తున్న పాత Android ఫోన్‌లు -iPhoneలలో WhatsApp ఇకపై పని చేయదు. వాట్సాప్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్‌లపై దృష్టి పెట్టడానికి పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేయడం ఆపివేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆపరేటింగ్ సిస్టమ్‌ను మెరుగుపరచడానికి Meta క్రమం తప్పకుండా WhatsAppని అప్‌డేట్ చేస్తుంది. మల్టీ అకౌంట్స్ – అదనపు సెక్యూరిటీ ఫీచర్స్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త ఫీచర్లు – సెక్యూరిటీ లెవల్ అప్ చేయడానికి వాట్సాప్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయమని మెటా వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. వాట్సాప్‌ను అప్‌డేట్ చేయని వినియోగదారులు కొత్త ఫీచర్లను కోల్పోతారు.ఈ ఫోన్లలోనే వాట్సాప్ ఇక పనిచేయదు

‘X ‘Audio, Video calls : ‘ఎక్స్‌’లో ఆడియో, వీడియో కాల్స్‌.. ఎలా యాక్టివేట్ చెయ్యాలంటే?