NTV Telugu Site icon

Fake Wedding Card Invitation: వాట్సాప్‌లో తెలియని వివాహ కార్డులపై క్లిక్ చేసారో.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ

Fake Wedding Card

Fake Wedding Card

Fake Wedding Card Invitation: ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో ప్రజలను మోసం చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్‌కు శ్రీకారం చుట్టారు. సైబర్ మోసగాళ్లు పెళ్లి కార్డులను ఆశ్రయించి మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక సలహా జారీ చేసింది. మీ వాట్సాప్‌లో తెలియని వ్యక్తి నుండి అలాంటి వివాహ కార్డు ఏదైనా పంపబడితే, దాన్ని తెరవడానికి ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు వెడ్డింగ్ కార్డ్‌ని తెరిచిన వెంటనే మీ ఖాతా నుండి మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read: Kejriwal Rewari Par Charcha: ‘రేవారీ పర్ చర్చా’ పేరుతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం

ఆన్లైన్ స్కామర్‌లు ఈ కొత్త ట్రిక్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాను క్షణాల్లో ఖాళీ చేయవచ్చు. హ్యాకర్లు .APK లేదా ఏదైనా ఇతర హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ ఫైల్‌ను వివాహ కార్డ్‌ రూపంలో PDF ఫార్మాట్‌లో పంపవచ్చు. ఈ హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా మీ మొబైల్ లేదా గాడ్జెట్‌ను ఆవహ్యాళి వాళ్ళు క్యాప్చర్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కొత్త సలహాను జారీ చేసింది. పెళ్లిళ్ల సీజన్‌లో ప్రజలు వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంపిన ఆహ్వాన కార్డులను తెరవడానికి ముందు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆ ఫైల్ గురించి మీకు తెలియకుంటే.. వెంటనే దాన్ని తెరవవద్దని పేర్కొన్నారు అధికారులు.

Also Read: Air Pollution: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు

కొద్దిపాటి అజాగ్రత్త వల్ల మొబైల్ లేదా గాడ్జెట్‌లలో సాఫ్ట్‌వేర్‌ను హడావుడిగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అడ్వైజరీలో తెలిపారు. ఈ కొత్త ట్రిక్ ద్వారా స్కామర్లు ప్రజల ఖాతాల్లోంచి లక్షల రూపాయలను దోచేస్తున్నారని, మొబైల్‌ని హ్యాక్ చేసే సాఫ్ట్‌వేర్ కార్డ్‌లోనే అమర్చబడి ఉంటుందని అధికారులు తెలిపారు. దీని కారణంగా కార్డులు డౌన్‌లోడ్ అయ్యి వినియోగదారు మొబైల్ హ్యాక్ చేయబడుతోందని, OTP లేకుండా కూడా ప్రజల ఖాతాలు ఖాళీ అవుతున్నందున ఇది ప్రమాదకరం అని అధికారులు తెలిపారు. ఇలాంటి ఏదైనా మోసం జరిగినట్లైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అడ్వయిజరీలో పేర్కొన్నారు అధికారులు.