WhatsApp Based Bus Ticketing in Delhi: ప్రయాణీకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మరియు మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వాట్సప్ ద్వారా బస్సు టికెట్లు జారీ చేసే అంశాన్ని అధ్యయనం చేస్తోంది. దేశ రాజధానిలో ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) వాట్సప్ టికెట్ సేవలను అందిస్తోంది. దానినే బస్సు ప్రయాణికులకూ విస్తరించాలని ఢిల్లీ నగర రవాణా శాఖ అధికారులు యోచిస్తున్నారు.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాట్సప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని 2023 మేలో కొన్ని మార్గాల్లో ప్రారంభించింది. వాట్సప్ టికెట్‌కు ప్రయాణికుల నుంచి ఆదరణ లభించటంతో.. మరిన్ని మార్గాలకూ డీఎంఆర్‌సీ విస్తరించింది. అయితే వాట్సప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్ల సంఖ్యపై పరిమితి ఉంటుంది. త్వరలోనే వాట్సప్‌లో బస్సు టికెట్ జారీ చేస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
Also Read: Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!
ఢిల్లీ మెట్రో టికెట్ కొనడానికి ప్రయాణికులు హాయ్ అని 91-9650855800కి వాట్సప్‌లో మెసేజ్ చేయాలి. లేదా మెట్రో స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయొచ్చు. అయితే వాట్సప్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్‌ను రద్దు చేసుకునే వెసులుబాటు లేదు. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే.. మార్జినల్ కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తారు. యూపీఐ పేమెంట్స్‌కు మాత్రం అదనపు రుసుము ఉండదు.
