NTV Telugu Site icon

WhatsApp : వాట్సాప్‌ డేటా బ్యాకప్‌పై భారీ షాక్.. కొత్త రూల్స్..

Whatsapp (4)

Whatsapp (4)

వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. అందుకే వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.. ఇటీవల ఎన్నో ఫీచర్స్ ను తీసుకొచ్చింది.. తాజాగా వాట్సాప్ యూజర్స్ కు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలు ఉచితం. అయితే, 2024 నుండి గూగుల్ డ్రైవ్‌లో ఉచిత అపరిమిత బ్యాకప్‌లను ఇవ్వబోనున్నట్లు తెలిపారు..

ఇక నుంచి వాట్సాప్ బ్యాకప్ ల స్టోరేజ్ కోటాను మాత్రమే పొందుతారు.. గూగుల్ డిస్క్‌లో అందించిన 15GB స్టోరేజీ పరిమితి మాత్రమే ఉచితంగా అందిస్తుంది. మీరు మరింత స్టోరేజీని పెంచుకోవాలనుకుంటే, కొంత డబ్బులను చెల్లించాలని చెప్పింది.. అంతేకాదు ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని చెప్పింది..

బీటా వెర్షన్ 2.23.26.7లో నివేదించింది సంస్థ.. ఇక గూగుల్ డిస్క్‌లోని వాట్సాప్ బ్యాకప్‌లు ఇకపై అపరిమిత స్టోరేజీని ఉచితంగా అందిందు. మీరు అదనపు స్టోరేజీ కోసం చెల్లించాలి.. వాట్సాప్ వినియోగదారుడు ఎంత స్టోరేజీని ఉపయోగించారో తెలుసుకోవాలంటే, వాట్సాప్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ ఆప్షన్‌ను చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ చాట్ బ్యాకప్ స్టోరేజ్ కోసం ఎంత వసూల్ చేస్తారన్నది మాత్రం తెలియలేదు.. త్వరలోనే దీని గురించి స్పష్టత రావాల్సి ఉంది..