Whats Today Updats 31.07.2022
1. నేడు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ మన్‌కీ బాత్ కార్యక్రమం జరుగనుంది.
2. ఏపీలో నేడు రెండో రోజు బార్ల ఈ వేలం జరుగనుంది. నేడు కోస్తాలోని 6 జిల్లా్ల్లో 500 బార్లకు ఈ వేలం నిర్వహించనున్నారు.
3. నేడు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. లింగంపల్లి-హైదరాబాద్-లింగంపల్లి మధ్య 18 సర్వీసులు రద్దు.
4. నేడు విశాఖకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ రానున్నారు. రవిశాస్త్రి శతజయంతి వేడుకల్లో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొననున్నారు.
5. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490 లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.63,700 లుగా ఉంది.
6. ఐటీ రిటర్నుల దాఖలుకు నేడు చివరి తేదీ. గడువు పొడిగించే అవకాశం లేదని ఐటీ శాఖ వెల్లడించింది.
7. నేడు విజయవాడలో కేంద్రమంత్ర కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పార్టీ ఆఫీస్‌లో కార్యకర్తలతో భేటీ కానున్నారు. తర్వత పింగళి వెంకయ్య స్వగ్రామంలో పర్యటించనున్నారు.
8. నేడు కొనసాగనున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం. శనివారం రూ.1,49,966 కోట్లకు చేరిన బిడ్లు. ఇప్పటివరకు 30 రౌండ్లలో 71శాతం వరకు విక్రయం.
9. నేడు ఫిలిం చాంబర్ జనరల్ బాడీ సమావేశం కానుంది. సినీ పరిశ్రమల సమస్యలు, తాజా పరిస్థితిపై చర్చించనున్నారు.
10. కామన్వెల్త్ గేమ్స్‌లో నేడు మహిళల క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. పాకిస్తాన్ మహిళల జట్టుతో భారత్ జట్టు ఢీ కొట్టనుంది. బర్మింగ్‌హామ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
