1. నేడు ఉదయం 10.30కి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ. నిన్న ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసిన జగన్.
2. చంద్రబాబు కందుకూరు సభలో విషాదం. రోడ్ షో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి. డ్రైనేజ్‌లో పడి మృతిచెందిన టీడీపీ కార్యకర్తలు. నేడు పార్టీ పరమైన లాంఛనాలతో అంత్యక్రియలు.
3.ఇవాళ కొరిశపాడు మండలం రేణింగవరం వద్ద హైవే రన్ వే ట్రైల్ రన్. ఎమర్జెన్సీ రన్ వే పై దిగనున్న నాలుగు ఫైటర్ జెట్ విమానాలు, కార్గో విమానం. అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యల కోసం 16వ నెంబర్ జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రన్ వే నిర్మాణం.
4. ప్రకాశం : యర్రగొండపాలెంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం, హాజరుకానున్న మంత్రి ఆదిమూలపు సురేష్.
5. కడప : మైలవరం మండలం దొమ్మర నంద్యాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
6. ఏలూరు జిల్లా : నేటి నుంచి రెండు రోజులపాటు పోలవరం లో పర్యటించనున్న పీపీఏ బృందం. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్షించనున్న బృందం.
7. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉదయం 10 గంటలకు నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు అనంతరం మనుబోలు.. తోటపల్లి గూడూరులలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
8. శ్రీకాకుళం : దండి వీధి సచివాలయం పరిధిలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొననున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.
9. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎన్టీఆర్ పార్క్ వద్ద మాదిగల చైతన్య భేరి కార్యక్రమం. హాజరుకానున్న మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వరరావు.. యంపి నందిగామ సురేష్.
10. అనంతపురం : ఆత్మకూరు మండలం సింగంపల్లి నుంచి ర్తెతు కోసం తెలుగుదేశం పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి పరిటాల సునీత.