NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today Ntv

Whats Today Ntv

1. నేడు తిరుపతిలో కేంద్రమంత్రి నితిణ్‌ గడ్కరీ పర్యటన.

2. హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్‌ స్పెషల్ డ్రైవ్‌. రాంగ్‌రూట్‌, ట్రిపుల్‌ రైడింగ్‌ నిబంధన కఠినతరం. రాంగ్‌ రూట్‌లో వెళ్తే రూ.1700, ట్రిపుల్‌ రైడింగ్‌కు రూ.12,00 ఫైన్‌.

3. ఫిఫావరల్డ్‌ కప్‌లో నేటి మ్యాచ్‌లు. గ్రూప్‌-జీలో మధ్యాహ్నం 3.30 గంటలకు కామెరూన్‌ తో సెర్బియ తలపడనుంది. గ్రూప్‌-హెచ్‌లో సాయంత్రం 6.30 గంటలకు సౌత్‌కొరియాను ఘనా ఢీ కొట్టనుంది.

4. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.48,560లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,980 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.67,500 లుగా ఉంది.

5. ఆగ్రేయ బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. దక్షిణ కోస్తా, రాయలసీమలో చెదురుముదురు వర్షాలు.

6. నేడు నల్గొండ దామరచర్ల పవర్‌ స్టేషన్‌కు సీఎం కేసీఆర్‌. పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం కేసీఆర్‌.

7. నేడు జిల్లాల కలెక్టర్‌లతో సీఎం కేసీఆర్‌ భేటీ. ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా సమీక్ష.

8. ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్‌ రెడ్డి. నేడు అధికారిక ఉత్తర్వులు.

9. మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ విచారణ వేగవంతం. నేడు ఐటీ విచారణకు మంత్రి మల్లారెడ్డి.