Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

1. నేడు ఇండియా-ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్ల విక్రయం. జింఖానా గ్రౌండ్స్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విక్రయం. ఈ నెల 25న ఉప్పల్‌లో భారత్‌-అస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌.

2. నేడు ఏపీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటన. మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి చేరుకోనున్న గడ్కరీ. ప్రభుత్వ కాలేజీలో ఫోటో ఎగ్జిబిషన్‌ సందర్శన. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న గడ్కరీ.

3. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో బతుకమ్మ చీరల పంపిణీ. తర్వాత పోడు భూములపై అధికారులతో సమావేశం.

4. నేటి పంజాబ్‌ ప్రభుత్వ బలపరీక్ష వాయిదా. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి అనుమతి నిరాకరణ. ఎమ్మెల్యేలు కొనుగోలు ఆరోపణలపై విచారణ.

5. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.45,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.49,960 పలుకుతోంది. అలాగే కేజీ వెండి ధర రూ62,200లుగా ఉంది.

 

Exit mobile version