Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు కరీంనగర్‌లో బండి సంజయ్‌ పాదయాత్ర. 24వ డివిజన్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న బండి.

2. జనగామ పాలకుర్తి బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు. కాంగ్రెస్‌కు ఎన్‌ఆర్‌ఐ ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా. బీజేపీకి పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సోమయ్య రాజీనామా. నేడు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్న నేతలు.

3. నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ. సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న మోడీ. సాయంత్రం 5.25 గంటలకు ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన సభ. బీసీ గర్జన సభలో పాల్గొననున్న మోడీ, పవన్‌ కల్యాణ్. సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి మోడీ తిరుగుపయనం.

4. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలకు కేసీఆర్‌. మందమర్రి, మంథని, పెద్దపల్లిలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న కేసీఆర్‌.

5. నేడు పుట్టపర్తిలో సీఎం జగన్‌ పర్యటన. ఉదయం 10.15 గంటలకు పుట్టపర్తి చేరుకోనున్న సీఎం. మధ్యాహ్నం 12.15 గంటలకు వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్‌. రూ.2,204.77 కోట్లు విడుదల చేయనున్న సీఎం.

6. నేడు చలో పుట్టపర్తికి టీడీపీ పిలుపు. పుట్టపర్తిలో టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్‌లు.

7. ఏపీలో కొనసాగుతున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. నేడు ఆముదాల వలస, వినుకొండ, ఆళ్లగడ్డలో బస్సు యాత్ర.

8. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ. IRR కేసులో మందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు పిటిషన్‌.

9. నేడు అనంతపురం జిల్లాలో పురందేశ్వరి పర్యటన. ఏపీలో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి. బూత్‌ లెవల్‌ కార్యకర్తలతో సమావేశంకానున్న పురందేశ్వరి.

10. నేడు ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో పోలింగ్‌. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్‌. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌. 40 స్థానాలకు బరిలో 140 మంది అభ్యర్థులు. మిజోరంలో 8,50,288 మంది ఓటర్లు. ఛత్తీస్‌గడ్‌లో తొలిదశలో 20 స్థానాలకు ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 40,78,689 మంది. 20 స్థానాలకు బరిలో ఉన్న 223 మంది అభ్యర్థులు.

Exit mobile version