NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

నేడు గవర్నర్ ప్రసంగంపై తెలంగాణ అసెంబ్లీ చర్చ.. బీఆర్ఎస్ నుంచి చర్చలో పాల్గొననున్న కేటీఆర్, తలసాని, కౌన్సిల్ నుంచి చర్చలో పాల్గొననున్న మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్..
నేడు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటన.. జంగారెడ్డిగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పరిశీలన.. మీడియా సమావేశం.. అనంతరం బీజెపీ బూత్ స్వశక్తికరణ జిల్లా సమావేశం.. ఏలూరు జిల్లా బీజెపీ కార్యవర్గ సమావేశానికి హాజరు..
నేడు కర్నూలు జిల్లా కోడుమూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర.. పాల్గొననున్న కేంద్ర మంత్రి దేవ్ సిన్హ్ చౌహన్..
నేడు కర్నూలు జిల్లా కరప మండలం నడకుదురులో వికసిత భారత్ సంకల్పయాత్ర హాజరుకానున్న కేంద్రమంత్రి సోం ప్రకాష్
నేడు రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం.. రాజమండ్రి జగదీశ్వరి హోటల్ లో సమావేశం..
నేడు మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతిలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రానికి తాడేపల్లిగూడెం చేరుకుంటారు..
నేడు ఒంగోలులోని మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయంలో కొండేపి నియోజకవర్గ సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం..
నేడు నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. హాజరుకానున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు
నేడు నెల్లూరు నగరంలోని సంతపేటలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
నేడు కావలిలోని పలు వార్డులలో పర్యటించనున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
నేడు జనసేన పార్టీ నేత నాగబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారి సమీక్ష సమావేశాలు
నేడు విశాఖ జిల్లా కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం.. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలనే డిమాండ్ తో కార్యాచరణ రూపకల్పన..
నేడు ప్రకాశం జిల్లాలో ఐదవ రోజు అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్న నిరసన కార్యక్రమాలు..
నేడు తూర్పు గోదావరి జిల్లా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా మండల, నియోజక వర్గ స్థాయిలో మెగా, మినీ ఉద్యోగ మేళాలు..
నేటి నుంచి తిరుపతి ఎయిర్ పోర్టులో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ మూసివేత.. నేటి నుంచి గోకుల్ ఆతిథి గృహంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా శ్రీవాణి టికెట్ల జారీ..
నేడు భద్రాచలం రామాలయంలో వివిధ సేవల రూపకర్త తూము లక్ష్మీ నరసింహ దాసు జయంతి ఉత్సవం.. నేటి అర్ధరాత్రి నుంచి భద్రాచలం రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం..
నేటి నుంచి ఆకాశంలో ఐదు రోజుల పాటు ఆద్భుతం.. ఆకాశం నుంచి రాలే ఉల్కాపాతాలను చూసే అవకాశం..