NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. 11 జిల్లాలకు సంబంధించిన 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు..

నేడు హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు.. జూబ్లీహిల్స్ లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు..

నేడు కరీంనగర్ లో బీజేపీ పట్టభద్రుల సంకల్ప యాత్ర.. పాల్గొననున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం..

నేడు తులసిబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో పిటిషన్.. రఘరామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు..

నేడు విశాఖ రైల్వేస్టేషన్ ఎదుట వామపక్షాల ఆందోళన.. కెకెలైన్ తో సహా మొత్తం వాల్తేరు రైల్వే డివిజన్ ను విశాఖపట్నం కేంద్రంగా.. దక్షిణ కోస్తా రైల్వేజోన్ లో కొనసాగించాలని డిమాండ్..

నేటి నుంచి ఉయ్యూర్ వీరమ్మ తల్లి తిరునాళ్లు.. 15 రోజుల పాటు ఉయ్యూరులో వైభవంగా జరగనున్న తిరునాళ్లు.. బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..

నేడు అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం.. రథోత్సవానికి వేలాదిగా హాజరుకానున్న భక్తులు..

నేడు మంగళగిరిలో జాతీయ నాస్తిక మేళా సమావేశాలు.. నిడమర్రులో రెండు రోజుల పాటు సమావేశాలు.. అడ్డుకుంటామంటున్న హిందూ సంఘాలు.. అప్రమత్తమైన పోలీసులు, భద్రత కట్టుదిట్టం..

నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 79,290.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 86,500.. హైదరాబాద్ లో కిలో వెంండి రూ. 1,06,900