* నేటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన.. దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్న చంద్రబాబు.. నవంబర్ లో విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్ కు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు..
* నేడు ఉదయం 8 గంటలకి మంగళగిరి బెటాలియన్ కు సీఎం చంద్రబాబు.. పోలీసు అమరవీరులకు నివాళులర్పించనున్న చంద్రబాబు..
* నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..
* నేడు రాజమండ్రిలో పోలీసు సంస్మరణ దినోత్సవ కవాతు కార్యక్రమంలో పాల్గొననున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్..
* నేడు ఉదయం 8.30 గంటలకి గోషామహల్ కు సీఎం రేవంత్ రెడ్డి.. పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొననున్న రేవంత్..
* నేడు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న దీపక్ రెడ్డి.. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాంచందర్ రావు..
* నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ నామినేషన్ల గడువు.. ఈరోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం.. రేపు నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉప సంహరణకు 24 వరకు గడువు..
* నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ఆర్ఆర్ఆర్ నిర్వాసిత రైతులు.. ఉదయం 11.30 గంటలకు నామినేషన్లు వేయనున్న రైతులు..
* నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. 48 గంటల్లో వాయు గుండంగా మారనున్న అల్పపీడనం..
* నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు.. బీహార్ లో ఇంకా తేలని ఇండియా కూటమి సీట్ల పంచాయితీ.. సీట్ల పంచాయితీపై క్లారిటీ ఇవ్వని ఇండికూటమి.. ఎవరికి వారు జాబితాల విడుదలతో గందరగోళం..
* నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా.. మధ్యాహ్నం 3 గంటలకు కొలంబో వేదికగా మ్యాచ్..
