* నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. ఇవాళ ఉదయం 10 గంటలకే 26 జిల్లాల కలెక్టర్లతో సదస్సు.. జిల్లాల్లోని పరిస్థితులను సీఎం చంద్రబాబుకు వివరించనున్న కలెక్టర్లు..
* నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం.. పాల్గొననున్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు..
* నేడు రాజస్థాన్, ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. జైపూర్ లో బంధువుల వివాహానికి హాజరుకానున్న రేవంత్.. జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్..
* నేడు ఢిల్లీకి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..
* నేటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్.. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం.. ఓరియంటేషన్ సెషన్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్..
* నేడు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన స్టే తొలగింపు.. ఉదయం 10.30కి ఎల్బీ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ..
* నేడు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి పున: ప్రారంభం.. ఉదయం. 8.33గంటలకు ప్రారంభించనున్న మంత్రి కొండా సురేఖ..
* నేడు మరోసారి కడప పీఎస్ కు ఎంపీ అవినాష్ పీఏ.. రెండు రోజులుగా రాఘవరెడ్డిని విచారిస్తున్న పోలీసులు.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై విచారణ..
* నేడు, రేపు MCHRDలో కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు..
* నేడు నల్గొంగకు ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య విచారణ కమిషన్.. ఎస్పీ వర్గీకరణపై బహిరంగ విచారణ చేయనున్న కమిషన్..
* నేడు తమిళనాడు- శ్రీలంత మధ్య తీరం దాటే అవకాశం.. దక్షిణకోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు..
* నేడు రాచకొండ పోలీసులు ముందు హాజరుకావాలని మోహన్ బాబుకి ఆదేశం.. ఇప్పటికే మోహన్ బాబుకి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఉదయం 10. 30 గంటలకు గన్స్ సరెండర్ చేయాలని ఆదేశం..
* నేడు ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ క్యాష్ పిటిషన్ పై విచారణ.. తనపై నమోదైన కేసులు క్యాష్ చేయాలని, వరుసగా ఓకే విషయంపై.. కేసులు నమోదు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని వర్మ పిటిషన్..
* నేడు ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్న సంజయ్ మల్హోత్రా..
* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 590.. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 95, 700.