Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటన.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ లో పాల్గొననున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడీలు..
నేడు కృష్ణజిల్లాలోని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల పరిశీలన.. కేంద్ర బృందంతో కలిసి పనులను పరిశీలించనున్న మంత్రి కొల్లు రవీంద్ర..
నేడు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..
నేడు తాడేపల్లి లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
నేడు తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర టూరిజం సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన.
నేడు ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
నేడు దేశంలోని రైతులకు ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్న ప్రధాని మోడీ.. ఈరోజు 109 రకాల 61 పంటలను విడుదల చేయనున్న మోడీ.
నేడు వినేశ్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు.. నేడు తీర్పు ఇవ్వనున్న క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు..

Exit mobile version