NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

నేడు ఏఐసీసీ పెద్దలను కలవనున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్న రేవంత్.. తెలంగాణ క్యాబినెట్ కూర్పుపై కీలక చర్చ జరిగే అవకాశం..
నేడు మిచౌంగా తుఫాన్ ప్రభావాంతో పలు జిల్లాల్లో వర్షాలు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు..
నేడు రాయలసీమ, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. బలహీన పడ్డ మిచౌంగ్ తుఫాన్.. అధికారులు అప్రమత్తం..
నేడు తుఫాన్ ఎఫెక్ట్ తో విజయవాడ, కర్నూలుకు విమానాలు రద్దు.. మిగిలిన విమాన సర్వీస్ లు షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని తెలిపిన ఎయిర్ పోర్ట్ వర్గాలు
నేడు అనంతపురం జిల్లా కుందర్పి మండలంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం..