NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* క్రికెట్‌ వరల్డ్‌ కప్‌: నేడు ఆఫ్గనిస్థానత్‌లో భారత్‌ ఢీ.. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం..

* అమరావతి: నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనున్న పిటిషన్లు.. IRR కేసు, అంగల్లు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్లు.. IRR కేసులో విచారణకు రావాలని సీఐడీ ఇచ్చిన నోటీసులు క్వాష్ చేయాలంటూ మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.. IRR కేసులో మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవులు ముని శంకర్ ముందస్తు బెయిల్ పై విచారణ

* విజయవాడ: ఏసీబీ కోర్టులో IRR, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ వేసిన పిటి వారెంట్ల మీద నేడు విచారణ

* తిరుమల: 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,361 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,579 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు

* అమరావతి: నేడు మరోసారి సీఐడీ విచారణకు నారా లోకేష్‌.. ఐఆర్ఆర్ కేసులో నిన్న లోకేష్‌ను 50 ప్రశ్నలను అడిగిన సీఐడీ

* తిరుమల: 14 వ తేదీ నవరాత్రి బ్రహ్మోత్సవాలుకు అంకురార్పణ.. 15వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ, 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం, 22వ తేదీ ఉదయం 7:15 స్వర్ణరథ ఉరేగింపు, 23వ తేదీ ఉదయం చక్రస్నానంతో ముగియనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు

* ప్రకాశం : పెద్దారవీడు మండలం ఏనుగుదిన్నెలపాడు పంచాయితీ కర్రోలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

* ప్రకాశం : కొత్తపట్నం మండలం గుండమాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లోని స్పందన హాలులో డీఆర్సీ సమావేశం, హాజరుకానున్న మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు..

* ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..

* బాపట్ల: నేడు వేమూరు మండలం పెరవలి గ్రామంలో జగనన్న సురక్ష , కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…

* అనంతపురం : తాడిపత్రి మండలం చుక్కలూరు లో గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

* అనంతపురం : నేడు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం.

* అనంతపురం : కళ్యాణదుర్గంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం.హాజరు కానున్న జిల్లా కలెక్టర్ .

* నెల్లూరు: నేటి నుంచి మూడు రోజులు పాటు నెల్లూరులో పర్యటించనున్న వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి.

* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని ఈస్ట్ కోడిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .

* తూర్పుగోదావరి జిల్లా: 33వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్..

* విశాఖ: నేడు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా.. పెండిగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని డిమాండ్

* పశ్చిమ గోదావరి: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్దతాడేపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు

* శ్రీకాకుళం: ఆమదాలవలసలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం పర్యటన.. మధ్యాహ్నం 3 గంటలకు పొందూరు మండలం కింతలి టూ తోలాపి రోడ్ నుండి అచ్చిపోలు వలస గ్రామానికి నూతనంగా వేసిన రోడ్డు ప్రారంభోత్సవo, జలజీవన్ మెషిన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి ప్రారంభోత్సవం మరియు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు

* శ్రీకాకుళం: రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు షెడ్యూల్.. ఉదయం 7:30 గంటలకు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధి, న్యూ కాలనీ లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 09:00గంటలకు శ్రీకాకుళం రూరల్ మండలం, కిస్తయ్యపేట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు.

* మంత్రి బూడి ముత్యాల నాయుడు నేటి కార్యక్రమాలు.. ఉదయం 9 గంటలకు కె . కోటపాడు మండలం కింతాడ గ్రామంలో.. ఉదయం 10.30 దేవరాపల్లి మం, గ్రామాలలో జరగనున్న జగనన్న సురక్ష కార్యక్రమాలలో పాల్గొంటారు.

* నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన కార్యక్రమలు.. కొవ్వూరు టౌన్ మున్సిపల్ కార్యాలయం లో జరుగు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొంటారు.. తాళ్లపూడి మండలం బల్లి పాడు గ్రామం,కాకర్ల సుబ్బమ్మ కళ్యాణమండపం నందు జరుగు “జగనన్నకు చెబుదాం” కార్యక్రమం లో పాల్గొంటారు. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామం నందు చిన్న నీటిపారుదల ట్యాంకులకు చేపల వేళ్లు విడుదల కార్యక్రమం లో పాల్గొంటారు. కొవ్వూరు టౌన్ పెనకనమెట్ట గ్రామం , ఎం.పి. యూ.పి స్కూల్ నందు జరుగు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొంటారు. కొవ్వూరు మండలం ఐ.పంగిడి గ్రామం నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం (140వ రోజు) లో పాల్గొంటారు