* నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం.. చేర్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న బీఆర్‌ఎస్ అధినేత
* నేడు గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం
* నేడు కామారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యట.. చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిక్నూర్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 3.30 గంటలకు చిన్నమల్లారెడ్డి.. సాయంత్రం 5.00 గంటలకు రాజంపేట.. రాత్రి 7 గంటలకు బిక్నూర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.
* హైదరాబాద్: నేడు డా.వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిక.. ఉదయం 7.30 గంటలకు తాజ్ కృష్ణ హోటల్ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్ కుమారుడు వినయ్ కుమార్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు.. ఇవాళ తిరిగి పార్టీ లో చేరనున్నారు..
* హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి, టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ జెట్టి కుసుమ కుమార్ ప్రెస్ మీట్
* నేడు భైంసాకు బండి సంజయ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ. సభకు రానున్న బండి సంజయ్.
* నేడు, రేపు టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలు.. ప్రతి శని, ఆదివారాల్లో ఉమ్మడి ఆందోళనలు చేపట్టాలని టీడీపీ-జనసేన జేఏసీ నిర్ణయం.. 18, 19 తేదీలలో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు చేపట్టనున్న టీడీపీ – జనసేన జేఏసీ.
* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్ని నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,140 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 26870 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు
* తిరుమల: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పంచమి సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభమైన సారే ఉరేగింపు
* తిరుమల: ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ.. రేపు శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. 7 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన నిర్వహించనున్న అర్చకులు
* పశ్చిమ గోదావరి జిల్లా: నేడు తణుకులో “సామాజిక సాధికార బస్సు యాత్ర”.. తణుకు వి మాక్స్ థియేటర్ ఏరియా నుంచి తణుకు నరేంద్ర సెంటర్ వరకు బైక్స్ ర్యాలీ.. అనంతరం నరేంద్ర సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ..
* ఏలూరు జిల్లాలో చేపట్టనున్న కుల గణననపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కుల ఆధారిత కార్పొరేషన్ చైర్మెన్లు, డైరెక్టర్లతో కలెక్టర్ సమావేశం.. జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్న కలెక్టర్
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు రూరల్ నియోజకవర్గ నేతలతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమావేశం
* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో కావలి నియోజకవర్గం నేతలతో పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజిజ్ సమావేశం
* నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు..
* తూర్పు గోదావరి జిల్లా : నేడు రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం .. ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్ లో సమావేశానికి సన్నాహాలు.. రాష్ట్రంలో బీసీల స్థితిగతులు, జరుగుతున్న అన్యాయాలు, సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై చర్చ. హాజరుకానున్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు
* అనంతపురం : వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ లో ఇండియా గెలవాలంటూ తాడిపత్రి లోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేయనున్న క్రీడాకారులు.
* శ్రీ సత్యసాయి : నేటి నుంచి సత్యసాయి 98వ జయంత్యుత్సవాలు ప్రారంభం.. వేణుగోపాల స్వామి రథోత్సవంలో ప్రారంభం కానున్న వేడుకలు.
* శ్రీ సత్యసాయి: ఈనెల 22 న డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవం. ముఖ్యఅతిథిగా హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
* శ్రీ సత్యసాయి : పరిగి మండల పరిషత్ కార్యాలయంలో నేడు మండల సర్వసభ్య సమావేశం
* నేడు విశాఖ తూర్పు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర.. పాల్గొననున్న రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆరిలోవ లాస్ట్ బస్టాప్ దగ్గర నుంచి ఏఎస్ రాజా గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ.. నాడు నేడులో తోట గురువు హైస్కూల్లో పనులు పరిశీలన.. ఏఎస్ రాజా గ్రౌండ్ లో బహిరంగ సభ..
* అనంతపురం : ఆత్మకూరు మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి కార్తీక మాసోత్సవాలు.
* అనంతపురం : ఈనెల 19న జరగనున్న వర్డల్ కప్ నేపథ్యంలో నగరంలో పీటీసీ మ్తెదానంలో మ్యాచ్ ను వీక్షించేందుకు ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు.
* గుంటూరు: నేడు ఆంధ్రప్రదేశ్ కులగణన – 20 23 రెవెన్యూ కల్యాణ మండపంలో స్టేక్ హోల్డర్లతో సమావేశం కానున్న జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి.. హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు ప్రజాప్రతినిధులు.
* గుంటూరు: నేటి నుండి రెండు రోజులు పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కు దారేది పేరిట టిడిపి జనసేన ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలు…
