NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* తెలంగాణలో నేడు ఎన్నికల నామినేషన్ల పరిశీల ప్రక్రియ.. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు.. ఈనెల 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న కౌంటింగ్‌

హైదరాబాద్‌: నేడు పంజాగుట్ట శ్మశానవాటికలో నటుడు చంద్రమోహన్‌ అంత్యక్రియలు..

* హైదరాబాద్‌: సరోజిని దేవి ఐ హాస్పిటల్ కి పేషెంట్స్ క్యూ.. దీపావళి టపాసులతో కంటి ప్రమాదాలు.. ఆస్పత్రిలో చేరిన 60 మందికి పైగా కంటి ప్రమాద బాధితులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించి టపాసులు కాల్చడం వాళ్లే ప్రమాదాలు

* హైదరాబాద్‌: నేటి నుంచి తిరిగి ఎన్నికల ప్రచారంలోకి సీఎం కేసీఆర్.. అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, నర్సంపేటలో కేసీఆర్ పర్యటన.. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ కేసీఆర్ ఎన్నికల ప్రచారం

* ప్రకాశం : దీపావళి పండుగ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరులో జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించి పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు

* నెల్లూరులోని సీఐఏ క్రీడా మైదానంలో అండర్ 16 ఇంటర్ జోనల్ క్రికెట్ పోటీలు

* అనంతపురం : గుంతకల్లు రూరల్ పరిధిలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మప్రచార వారోత్సవాలు.

* శ్రీ సత్యసాయి : ఈనెల 15,16వ తేదీల్లో హిందూపురంలలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ .

* నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. కొవ్వూరు మండలం దొమ్మేరు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (160వ రోజు) నిర్వహిస్తారు… కొవ్వూరు రూరల్ మండలం పెనకనమెట్ట సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (160వ రోజు) నిర్వహిస్తారు.. పెనకనమెట్ట సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (160వ రోజు) నిర్వహిస్తారు.

* తిరుమల: 17వ తేదీన నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* తిరుపతి: శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇవాళ కేధారి గౌరీ వ్రతం..

* అమరావతి: నేడు టీడీపీ – జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం. ఉమ్మడి మేనిఫెస్టోపై రెండు పార్టీల కసరత్తు

* నంద్యాల: బనగానపల్లె మండలం యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రంలో నేడు ప్రత్యేక పూజలు, బిల్వార్చన , మహా మంగళహారతి

* భద్రాద్రి: నేడు పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్‌ ఆశీర్వాద సభలు

* పశ్చిమ గోదావరి: రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భీమవరం, పాలకొల్లు పంచారామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు..

* పశ్చిమ గోదావరి జిల్లా: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11గంటల నుంచి అందుబాటులో ఉండనున్న మంత్రి.. అనంతరం పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి..

* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,807 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,974 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు

* హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారుల దాడులు.. ఫార్మా కంపెనీలో సోదాలు.. నగర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. ఫార్మా కంపెనీ యజమాని ఇల్లు, డైరెక్టర్‌, సిబ్బంది ఇళ్లు, ఆఫీసులో సోదాలు..

* తిరుపతి: కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంతవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న పద్మావతి అమ్మవారు