Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు.. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, ఉత్తర తెలంగాణలో అధికా ఉష్ణోగ్రతలు

* హైదరాబాద్‌: నేడు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తుది తీర్పు వెలువరించనున్న తెలంగాణ హైకోర్టు

* నేడు ఈడీ విచారణకు మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్..

* ఏపీలో నేటి నుంచి మాన్యువల్‌ పద్ధతిలో ల్యాండ్‌ రిజిస్ట్రేషన్లు

* నేడు కరీంనగర్‌లో టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన.. భూమిపూజ చేయనున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గంగుల కమలాకర్‌

* కాకినాడ: నేడు జేఎన్టీయూ కాకినాడ తొమ్మిదవ స్నాతకోత్సవం, ముఖ్య అతిధులుగా హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి బొత్స.. 2021, 2022 బ్యాచ్ కి చెందిన విద్యార్థులకి పీహెచ్‌డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేత.. యూనివర్సీటీ తరపున గ్రీన్ కో గ్రూప్ ఎండీ చలమలశెట్టి అనిల్ కి గౌరవ డాక్టరేట్

* నేడు కాకినాడ రానున్న బీజేపీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ ధియోధర్.. పార్టీ నేతలు సమావేశంలో పాల్గొనున్న సునీల్

* కాకినాడ: నేడు తుని తలుపులమ్మ అమ్మ వారి ఆలయ జీర్ణోద్దరణ కార్యక్రమం.. కొండ గుహలో మూల విరాట్ కి ఇరు వైపులా అమ్మవారి విగ్రహాలు, ఉప దేవత విగ్రహాలు ప్రతిష్ఠంచనున్న మంత్రి దాడిశెట్టి రాజా

* ప్రకాశం : యర్రగొండపాలెం మండలం గంగాపాలెంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అనంతరం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.

* ప్రకాశం : టంగుటూరు మండలం వల్లూరు లోని వల్లూరమ్మ ఆలయ మండప ప్రారంభోత్సవం, బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* బాపట్ల : నేడు వేమూరు మండలం వరహాపురం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున…

* గుంటూరు: నేటి నుండి జూన్ 6 వరకు లాలాపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు…

* పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడులో శంబులింగేశ్వర స్వామి ఆలయ పునః ప్రారంభం..

* పల్నాడు : మరమ్మత్తుల కారణంగా నేడు, రేపు బెల్లంకొండ రైల్వే గేటును మూసివేయనున్న అధికారులు…

* అనంతపురం : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చేనేతకు రక్షణ అనే అంశంప్తె నేడు చర్చ కార్యక్రమం.

* అనంతపురం : కళ్యాణదుర్గం నియోజకవర్గ యానిమేటర్స సమావేశం. పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .

* ప్రకాశం : ఒంగోలు లోని గోపాల్ నగర్ లో శ్రీకృష్ణ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా మహా కుంబాభిషేకం..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు అనంతసాగరం మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..

* విశాఖలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కరోజు పర్యటన.. అచ్యుతపురం, విశాఖ నగరాల్లో పార్టీ నేతల ఇళ్లల్లో వివాహ వేడుకలకు హాజరుకానున్న చంద్రబాబు

* క‌డ‌ప: 112వ రోజుకు చేరిన లోకేష్ యువ‌గ‌ళం.. జ‌మ్మల‌మడుగు నుంచి ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్రవేశించ‌నున్న పాద‌యాత్ర

* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. కొవ్వూరు టౌన్ శ్రీనివాస పబ్లికేషన్స్ ఎదురుగా జరుగు శ్రీ రాజ్య లక్ష్మి గోడ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వార్లు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు.. చాగల్లు మండలం నేలటురు గ్రామం శ్రీ సీతా రామ ఫంక్షన్ హాల్ నందు జరుగు ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు.

* విశాఖ: నేడు నేవల్ ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ 2023.. ముఖ్యఅతిథిగా నౌకాదళ ప్రధాన అధికారి హరికుమార్.. ఇండియన్ నేవీలో విశిష్ట సేవలు అందించిన వారికి శౌర్య,సేవా పతకాల ప్రదానం, 33మందికి అవార్డులు అందజేయనున్న నేవీ చీఫ్

* విశాఖ: నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని పర్యటన..

* తిరుమల: 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,871 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 32,859 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు

* వరంగల్ లో మంత్రి హరీష్ రావు పర్యటన.. ప్రభుత్వ ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్ ను ప్రారంభించనున్న హరీష్ రావు.. KMC లో అకాడమిక్ బ్లాక్ ప్రారంభించిన అనంతరం హెల్త్ సిటీ సైట్ సందర్శించి అధికారులతో సమీక్ష.. సాయంత్రం 6 గంటలకు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్మిక యుద్ధభేరిలో చీఫ్ గెస్ట్ గా పాల్గొననున్న మంత్రి హరీష్ రావు

* నిర్మల్: ఈ రోజు బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ .. ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్ లోని పరిపాలన భవనంలో ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వెంకటరమణ .

* ఖమ్మం: నేడు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి అజయ్ కుమార్, కార్పొరేషన్ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష

Exit mobile version