Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించనున్న సీఎం.. అనాథ పిల్లలతో ముచ్చటించనున్న జగన్‌

* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌.. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,126 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 37,597 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు

* ప్రకాశం : ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా యర్రగొండపాలెంలో వైసీపీ శ్రేణుల బైక్ ర్యాలీ, పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌.. యర్రగొండపాలెం మండలం గంగాపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.

* ఒంగోలు వైసీపీ కార్యాలయంలో సీఎంగా జగన్ భాద్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం, హాజరుకానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం : దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు..

* రేపు కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన..

* తిరుమల: జూన్ 2 నుంచి 4వ తేది వరకు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు

* జూన్ 7వ తేదీన ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణంకు శంకుస్థాపన.. 70 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీవారి ఆలయ నిర్మాణం..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో వికలాంగులకు ఉపకరణాలను పంపిణీ చేస్తారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం

* క‌డ‌ప: నేటి నుంచి జిల్లాలో తిరిగి లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర. మ‌హానాడు కోసం బ్రేక్.. జ‌మ్మల‌మ‌డుగులో కొన‌సాగ‌నున్నయాత్ర, బ‌హిరంగ స‌భ‌..

* క‌డ‌ప: వైసిపి అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు పూర్తయిన సంద‌ర్భంగా న‌గ‌రంలో డిప్యూటీ సీఎం, మేయ‌ర్ ఆధ్వర్యంలో సంబ‌రాలు.. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేం, అన్నదానం చేయ‌నున్న నేత‌లు.

* అనంతపురం : కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీచరణ్.

* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసిపి ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పలు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు…

* జూన్ 2న గుంటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన.. వైయస్సార్ యంత్ర సేవ -2 లో భాగంగా ట్రాక్టర్లను ,హార్వెస్టర్లను పంపిణీ చేయనున్న సీఎం జగన్.

* నేడు కాకినాడలో పర్యటించనున్న జిల్లా ప్రత్యేక అధికారి గోపాల కృష్ణ ద్వివేది.. అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్ర స్థాయి లో పరీశీలించనున్న ద్వివేది

* నేడు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఉద్యోగుల సామూహిక రిలే నిరాహార దీక్ష.. నిరసనలో పాల్గొననున్న ప్రభుత్వ ఉద్యోగులు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన .. జగనన్న ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పురస్కరించుకొని కొవ్వూరు క్యాంప్ కార్యాలయంలో జరుగు సంబరాలలో పాల్గొంటారు

* సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నేడు MIM బహిరంగ సభ.. హాజరుకానున్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీ, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ

* మంత్రి అజయ్ కుమార్ ఖమ్మం లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు

Exit mobile version