NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ భేటీ.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్‌

* హైదరాబాద్‌: నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ భేటీ.. విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్ లో ఇంతవరకు పరిష్కారం కానీ అంశాలు, జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ, ధాన్యం కొనుగోలు, ధరణి, వచ్చే విద్యాసంవత్సరానికి యాక్షన్ ప్లాన్, వానాకాలం యాక్షన్ ప్లాన్ పై చర్చ

* నేడు భువనగిరి , వరంగల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నిక బూత్ ఇంఛార్జిలు, అసెంబ్లీ ఇంఛార్జ్‌లతో భేటీ కానున్న కిషన్ రెడ్డి

* ప్రకాశం : ఒంగోలు రైస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించనున్న కలెక్టర్ దినేష్ కుమార్..

* ప్రకాశం: మద్దిపాడు మండలం మల్లవరం ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

* బాపట్ల : చీరాల మండలం వాడరేవు నుంచి ఇవాళ తిరుగు పయనం కానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. నిన్న వ్యక్తిగత పర్యటన నిమిత్తం వాడరేవు కు వచ్చిన గవర్నర్..

* తిరుమల: పద్మావతి పరిణయోత్సవాలలో రోండోవ రోజు.. ఇవాళ గరుడ వాహనంపై ఉరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ

* నెల్లూరు జిల్లా: రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ పై రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

* తిరుమల: ఇవాళ నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఇవాళ నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటలకు వరకు ఆర్జిత సేవలకు సంబంధించి రిజిష్ర్టేన్ ప్రకియ.. ఎల్లుండి మధ్యహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు

* తూర్పు గోదావరి జిల్లా: నేటి ఉదయం 9 గంటలకు రాజమండ్రిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మీడియా సమావేశం.

* అనంతపురం : జిల్లాలో ఈనెల 24 నుంచి వేరుశనగ విత్తన పంపిణీ.. నేటి నుంచి విత్తనాల కోసం ర్తెతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం.

* అన్నమయ్య జిల్లా : రైల్వే కోడూరు వాసవి జయంతి సందర్భంగా కోడూరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం లో ఉదయం నుండి ప్రత్యేక పూజలు.. కన్యకల చే 108 కలాశాలతో కోడూరు మాడ వీధిల్లో ఊరేగింపు

* నంద్యాల: బనగానపల్లెలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 ఆరాధన మహోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారి గ్రామోత్సవం

Show comments