NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* ఐపీఎల్‌ 2024: నేడు ముంబై ఇండియన్స్‌తో లక్నో ఢీ.. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌

* నేడు రాయ్‌బరేలిలో సోనియాగాంధీ పర్యటన.. నేడు, రేపు రాహుల్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్న సోనియా

* తిరుమల: నేటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ

* రెండో రోజు ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యామ్నం 12 గంటల వరకు ఒక సెషన్‌.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో సెషన్‌.. రేపటి నుంచి 23వ తేదీ వరకు ఎంపీసీ విద్యార్థులకు పరీక్షలు

* ప్రకాశం : ఒంగోలు మల్లయ్య లింగం భవన్ లో రైతాంగ సమస్యల పరిష్కారంపై ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు..

* నెల్లూరు జిల్లా: టిడిపి నేత. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం

* తూర్పుగోదావరి జిల్లా: తాత్కాలికంగా పలు రైళ్లు రద్దు.. ట్రాఫిక్ నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైలు ఈనెల 26, 27 తేదీల వరకు తాత్కాలికంగా రద్దు.. రాజమండ్రి-విశాఖపట్నం, రాజమండ్రి-నర్సాపూర్, నిడదవోలు-నరసాపూర్, నర్సాపూర్-విజయవాడ, నర్సాపూర్-రాజమండ్రి, విశాఖపట్నం-గుంటూరుతో పాటు మరికొన్నింటిని రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు.

* అనంతపురం : గార్లదిన్నె మండలం యర్రగుంట్లలో నేటి నుంచి రెండు రోజుల పాటు పోతులూరి వీరబ్రహ్మం ఆరాధనోత్సవాలు.

* తిరుపతి: ధ్వజారోహణంతో ప్రారంభ‌మైన గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

* నంద్యాల: నేటి నుండి బనగానపల్లె లో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 ఆరాధన మహోత్సవాలు ప్రారంభం

* శ్రీసత్యసాయి : వాసవి జయంతి పురస్కరించుకొని హిందూపురంలో నేటి నుంచి రెండు రోజులు పాటు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

* తిరుపతి: శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలలో తొలిరోజు ఉదయం చిన్న శేష వాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూన్న స్వామి వారు

* వరంగల్: 8వ రోజుకు చేరుకున్న భద్రకాళి అమ్మవారి భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు… నేడు ఉదయం అమ్మవారికి చతుః స్తానార్చన, డోలోత్సవం భద్ర పీఠసేవ లో.. సాయంకాలం అశ్వవాహన సేవ లో కొలువుదీరనున్న భద్రకాళి అమ్మవారు.

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లని నిండి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,369 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 41,927 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు