* నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడనున్న బెంగళూరు.. చెన్నై వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం..
* ఐపీఎల్ తొలి షెడ్యూల్‌లో నేటి నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు మ్యాచ్‌లు.. ఎన్నికల నేపథ్యంలో 21 మ్యాచ్‌లకే ఐపీఎల్ షెడ్యూల్
* ఢిల్లీ: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.. కేజ్రీవాల్ ను 9 రోజుల కస్టడీకి కోరనున్న ఈడీ
* నెల్లూరు : కందుకూరు మండలం మాచవరంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తో భేటీ కానున్న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి..
* ప్రకాశం : ఒంగోలు నగరంలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
* తిరుమల: శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో మూడోవ రోజు.. ఇవాళ తెప్పలపై మూడు ప్రదక్షణములుగా విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ.
* నెల్లూరు జిల్లా: జలదంకిలో ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న నెల్లూరు లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి
* నెల్లూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ అభ్యర్థులు.. జనసేన నేతల సమన్వయ సమావేశం
* నెల్లూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించనున్న వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి
* నెల్లూరు: మిడవలూరులో వైసీపీ నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
* నెల్లూరు జిల్లా: నేడు రాపూరు మండలంలోని పెంచలకోనకు టీడీపీ అధినేత చంద్రబాబు.. శ్రీ పెంచల లక్ష్మీనరసింహస్వామి .. మహాలక్ష్మి అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు.. అనంతరం తాడేపల్లికి వెళ్లనున్న చంద్రబాబు.
* కడప: నేడు బద్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో పర్యటించనున్న నారా భువనేశ్వరి.. చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి
* శ్రీ సత్యసాయి : కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహ వాహనంపై దర్శనమివ్వనున్న స్వామి.
* అనంతపురం : ఆత్మకూరు మండలంలోని పంపనూరు కొండప్తె వెలసిన మలోబులేశుడి స్వామి ఉత్సవాలు ప్రారంభం.
* అనంతపురం : కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో వ్తెసీపీ కార్యకర్తల నిరసన. నియోజకవర్గ సమన్వయకర్తను తమ గ్రామంలో రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆవేదన. పార్టీలో ఉన్న వారందరినీ కలుపుకుపోవాలని సూచన.
* నంద్యాల: అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఎగువ అహోబిలంలో తిరుమంజనం, గజవాహనం, తిరు కళ్యాణోత్సవం.. నేడు దిగువ అహోబిలంలో వేణు గోపాల స్వామి అలంకారం, పొన్న చెట్టు వాహనం…
* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చనలు సాయంత్రం పల్లకి సేవ
* కర్నూలు: నేటి నుండి మద్దికేర( మం) పెరవలిలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. స్వామివారికి కుంకుమార్చన, మహా మంగళహారతి అభిషేకాలు, పంచహారతి, ప్రత్యేక పూజలు.
* తిరుమల: 23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,485 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 23,851 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.1 కోట్లు
