NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* ఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రెస్‌మీట్‌.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో కీలక సూచనలు చేసే అవకాశం

* హైదరాబాద్‌: ఈ రోజు తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల

* కడప : కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమైన పోలీసులు… ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా.. నేటి సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు 126 రౌడీ షీటర్స్ గృహనిర్బంధం.. జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీలకు పోలీసులు కౌన్సిలింగ్.. కౌంటింగ్ రోజు ఘర్షణలు జరగకుండా ఉండేందుకు కోసం 652 మందిని నేటి సాయంత్రం నుంచి అదుపులోకి తీసుకొనున్న పోలీసులు…

* కడప: ఈ రోజు రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం.. షాపులు బంద్ చేయాలని కోరిన పోలీసులు.. రేపు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక…

* నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం విస్తృతంగా ఏర్పాట్లు.. మూడంచల భద్రత, గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలకు కనిపిస్తామని స్పష్టం చేసిన పోలీసులు

* చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ..

* కడప : నేటి నుంచి మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్..

* అనంతపురం : కౌంటింగు నేపథ్యంలో ఈనెల 3, 4 తేదీలలో జేఎన్టీయు పరిసరాలలో ట్రాఫిక్ మళ్లింపు.. సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి

* తిరుమల: ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు

* తిరుమల: 22వ తేదీన పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* నేడు తెలంగాణ లాసెట్‌ పరీక్ష.. ఏపీలో 4 తెలంగాణలో 64 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

* తిరుమల: 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,740 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 35,462 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు