Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* అనంతపురం : జిల్లాలో రెండు టమాట ప్త్రెమరీ ప్రాసెసింగ్ యూనిట్లు.. నేడు వర్చువల్ విధానంలో భూమి పూజ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌.

* అనంతపురం : సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ జిల్లా వ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ .

* అమరావతి: విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు TNSF, AISF పిలుపు

* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా

* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురం లో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణు

* ప్రకాశం : త్రిపురాంతకం మండలం దూపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

* ప్రకాశం : నారా లోకేష్ యువగళం 165వ రోజు పాదయాత్ర.. సంతనూతలపాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.. అనంతరం పలు గ్రామాల మీదుగా ఒంగోలు శివారు విడిది కేంద్రం చేరుకుని బస.

* ప్రకాశం : ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని వైసీపీ నేతలతో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం..

* నెల్లూరు: రొట్టెల పండుగ నిర్వహణ పై వివిధ శాఖల అధికారులతో నెల్లూరులో సమీక్ష సమావేశం..

* తూర్పుగోదావరి జిల్లా : నేడు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్.. ఏపీలో విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యాసంస్థల బంద్

* అంబేద్కర్ కోనసీమ:జిల్లా : రేపటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలాపురం పర్యటన ఈనెల 28వ తేదీకి వాయిదా.. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు.. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ విడుదల చేయనున్న సీఎం జగన్..

* తూర్పుగోదావరి జిల్లా : నేడు కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మెళా.. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో జరగనున్న మెగా జాబ్ మెళా.. పాల్గొంటున్న ప్రముఖ ఐటీ కంపెనీలు, వివిధ కార్పోరేట్ సంస్థలు.. దిగ్గజ కంపెనీల్లో దాదాపు 2100 మందికి ఉపాధి అవకాశాలు

* విశాఖ; నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం.. 44అంశాలతో ప్రధాన అజెండా..

* తూర్పుగోదావరి జిల్లా : తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.40 అడుగులకు తగ్గిన గోదావరి వరద నీటిమట్టం.. బ్యారేజీ నుండి 8 లక్షల 6 వేల 835 క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి విడుదల

* తూర్పు గోదావరి జిల్లా: నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన కార్యక్రమాలు.. కొవ్వూరు టౌన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జరుగు మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

* తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన అదనపు కోటా విడుదల.. రోజుకి 4 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

* నేడు గుంటూరులో బిజెపి కోస్తా ఆంధ్ర జోన్ సమావేశం.. హాజరుకానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర సహా ఇంచార్జ్ సునీల్ దియోదర్ తదితరులు..

* నేడు గుంటూరు శంకర్ విలాస్ నుండి సిద్ధార్థ గార్డెన్స్ వరకు బిజెపి శ్రేణుల భారీ ర్యాలీ…

* బాపట్ల : నేడు భట్టిప్రోలు మండలం తొట్టెంపూడి లో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మేరుగ నాగార్జున…

* పల్నాడు: నేడు వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం…

* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుంచి రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జ్ పై పల్లె వెలుగు బస్సుల రాక పోకలకు అనుమతి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్

Exit mobile version