Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేటి నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్ట్‌.. రాజ్‌కోట్‌ వేదికగా మ్యాచ్‌

* ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. నేడు రైతు సంఘాలతో చర్చలు జరపనున్న కేంద్రం

* తిరుమల: 18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,275 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 25,293 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు

* హైదరాబాద్‌: నేడు కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్‌ వేయనున్న రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌ యాదవ్.. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, దిగ్విజయ్‌సింగ్‌

* హైదరాబాద్‌: బీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా నేడు నామినేషన్‌ వేయనున్న వద్దిరాజు రవిచంద్ర

* నేడు మల్లన్న భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కొమురవెల్లిలో నిర్మించ తలపెట్టిన రైల్వే స్టేషన్ ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

* నంద్యాల: శ్రీశైలంలో రేపటి నుంచి 21 వరకు మహా కుంభాభిషేక మహోత్సవం.. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డికి ఆహ్వానం

* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా

* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు.. 7 వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. ఇవాళ, రేపు, ఎల్లుండి తిరుపతిలో జారి చేసే సర్వదర్శన టోకేన్లు రద్దు చేసిన టీటీడీ.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు

* ప్రకాశం : చీమకుర్తి మండలంలోని మూడు గ్రామాలలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగు నాగార్జున, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

* నెల్లూరు జిల్లా: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు.. మనుబోలు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

* నెల్లూరు: నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ నేతల సమావేశం..

* నెల్లూరు: చేజర్ల మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

* నెల్లూరు: నారాయణరెడ్డిపేట మైపాడు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

* విశాఖ: వికసిత్ భారత్ ప్రణాళికల కోసం నేడు నీతి ఆయోగ్ సమావేశం. మత్స్యశాఖపై నిర్వహిస్తున్న వర్క్ షాప్‌లో పాల్గొననున్న నీతి ఆయోగ్ సభ్యుడు

* విశాఖ: నేడు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన.. ఫిషరీస్ వర్క్ షాపు లో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి..

* విశాఖ: DLB గ్రౌండ్‌లో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయనున్న పురుషోత్తం రూపాల, రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.

* అనంతపురం : తాడిపత్రి రూరల్ పరిధిలోని ఆర్‌డీటీ కాలనీ సమీపంలో నూతనంగా నిర్మించిన టిడ్కో గృహల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

* తూర్పుగోదావరి జిల్లా: నేడు హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులను జగన్ ప్రభుత్వం దగా చేసిందనే ఆరోపణలపై బాధితుల తరపున రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా నిరసన.. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన

* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. అనంతరం విజయవాడ వెళ్ళనున్న మంత్రి

* తిరుపతి: రేపు పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు.. 7 వాహనాలు పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న పద్మావతి అమ్మవారు..

* ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు, గుంటూరు జిల్లాల పర్యటన.. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం.. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

* విజయవాడ: నేడు మైలవరంలోని రెడ్డిగూడెం మండలంలో ఆసరా కార్యక్రమం.. హాజరు కానున్న మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని

* విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జై హింద్ పార్టీ అధ్వర్యంలో నేడు ధర్నా చౌక్ లో ధర్నా. పాల్గొననున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

* విజయవాడ: అగ్రి గోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ధర్నా చౌక్ లో న్యాయ పోరాట దీక్ష.. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టిన అగ్రీ గోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

* విజయవాడ: నేడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకాన్ని ఆవిష్కరించనున్న ఇద్దరు నేతలు.. సాయంత్రం 7 గంటలకు జరిగే కార్యక్రమానికి హాజరు అవుతున్న సీపీఐ రామకృష్ణ, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి

* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో మూడు రోజులు జరగాల్సిన పవన్ కల్యాణ్‌ పర్యటన రద్దు.. పవన్ హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అవరోధాలు సృష్టించారని
జనసేన పార్టీ ప్రకటన

* నేడు, తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై రిప్లై.. సభలో కుల, జనగణన బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

* అమరావతి: రాజధాని ఫైల్స్‌ సినిమాపై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు

Exit mobile version