Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్‌

* అమరావతి: నేడు ఆర్ధిక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష, ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై సంబంధిత అధికారులతో చర్చ

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన, రాజమండ్రి రూరల్, మండపేట, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో కార్యక్రమాలు, రోడ్ షోలు, సదస్సులు, భవిష్యత్తుకు గ్యారంటీ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు

* విశాఖ: నేటి మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, 6వ రోజు వారాహి విజయ యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో పర్యటన. జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన ఎర్రమట్టి కొండలను పరిశీలించనున్న పవన్, ప్రకృతి సంపదను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తోన్న జనసేనాని

* నెల్లూరు జిల్లా: ఓటర్ల జాబితా పరిశీలనపై నెల్లూరులో అధికారులతో నేడు కలెక్టర్ హరి నారాయణ సమావేశం

* తిరుపతి: ఈ నెల 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా స్వర్ణరథోత్సవం పై విహరించనున్న శ్రీపద్మావతి అమ్మవారు

* అనంతపురం : రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం.. ముస్తాబ్తెన హనుమద్ క్షేత్రాలు.

* అనకాపల్లి జిల్లా: నేడు నాతవరం మండలం బమిడికలొద్ది అటవీ ప్రాంతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పర్యటన.. వివాదాస్పద లేట్రైట్ మైనింగ్ ప్రాంతాలను పరిశీలించనున్న NGT బృందం.. బమిడికలొద్దిలో లేట్రైట్ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని, పర్యావరణంకు హాని చేస్తున్నారని ఫిర్యాదులు.

* నేటి నుండి రెండు రోజులపాటు బాపట్లలో పర్యటించనున్న వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి.. బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులు, పార్టీ శ్రేణులతో సమావేశంకానున్న ఎంపీ విజయసాయిరెడ్డి.

* గుంటూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేటి నుండి 19 వరకు అంగన్వాడీల పోరుయాత్ర …

* అల్లూరి సీతా రామరాజు జిల్లా: నేడు పాడేరులో వైఎస్సార్ సీపీ సమన్వయ సమావేశం.. హాజరుకానున్న రీజనల్ కో ఆర్డినేటర్ సుబ్బారెడ్డి..

* కర్నూలు: అమావాస్య సందర్భంగా హాళగుంద మండలం దేవరగుట్టులో మాళమల్లేశ్వరస్వామి ఆలయంలో కుంకుమార్చన, మహా మంగళారతి, ప్రత్యేక పూజలు, అన్నదానం

* ఏలూరు : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోనే ద్వారకా తిరుమల చిన వెంకన్న సేవ టికెట్లు, ఇకపై ఆన్‌లైన్‌లోనే లభించనున్న నిత్యార్జిత కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, అష్టోత్తరం, సుప్రభాత సేవ టిక్కెట్లు, ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే సేవా టికెట్లు విక్రయించాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు

* చిత్తూరు: పెనుమూరు మండలం పులికల్లు సచివాలయం పరిధిలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

* తిరుపతి: నేడు టీటీడీ పరిపాలన భవనం ముందు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి మరియు హిందూ JAC నాయకులు కలిసి నిరసన కార్యక్రమం.. నడకదారి భక్తుల పై మరియు ద్విచక్ర వాహనాల్లో వచ్చే భక్తులపై టీటీడీ పెట్టిన కఠినమైన ఆంక్షలను పూర్తిగా వ్యతిరేకిస్తూ తక్షణమే ఆంక్షలను తొలగించాలని డిమాండ్.

* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 7,778 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 19,070 క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 862.10 అడుగులు.. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* తిరుపతి: శ్రీకాళహస్తి దేవస్థానం నుండి ధర్మ ప్రచార రథం ప్రారంభించనున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

* విశాఖ: నేడే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ప్రారంభం.. ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్న సినీనటి శ్రీలీలా.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ACA ఆధ్వర్యంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కి సర్వం సిద్ధం. ఇవాళ తొలి మ్యాచ్‌లో తలపడనున్న కోస్టల్ రైడర్స్ – బెజవాడ టైగర్స్

*హైదరాబాద్‌: రేపటి నుంచి ఎంసెట్‌ ప్రత్యేక విడత కౌన్సిలింగ్‌..

* విజయవాడ: 17న జరగాల్సిన చలో విద్యుత్ సౌధ కార్యక్రమం వాయిదా.. కొత్త తేదీ ఒకట్రెండు రోజుల్లో తెలుపుతామని ప్రకటన

Exit mobile version