NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేడు పాకిస్తాన్ ప్రధాని ఎన్నిక జరగనుంది. పాక్ ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ నామినేషన్ వేయగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ఒమర్ నామినేషన్ వేశారు. ప్రధాని ఎన్నికపై జాతీయ అసెంబ్లీ ఓటింగ్ నేడు జరగనుంది.

నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో కూడా పోలియో చుక్కల కార్యక్రమం ఏర్పాట్లు చేశారు.

నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఫౌండర్ తుమ్మలపల్లి హరి నారాయణ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మోహన్ హాజరుకానున్నారు.

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నేడు జరగనుంది. స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ మహా పాదయాత్ర ఉంటుంది. మహా పాదయాత్రలో ఉక్కు కార్మికులు భారీగా పాల్గొననున్నారు.

నేడు బెజవాడలో ఆర్య వైశ్యల ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

నేడు ఉన్నత విద్య ప్లానింగ్ బోర్డు సమావేశం జరగనుంది. విట్ వర్సిటీలో నేడు, రేపు విద్య ప్లానింగ్ బోర్డు భేటీ జరగనుంది.

నేడు ఖమ్మం జిల్లలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి తుమ్ముల పర్యటించనున్నారు. ఎర్రుపాలెం మండలంలో బట్టి పర్యటించనున్నారు.