NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

నేడు ఎన్టీఆర్‌ జయంతి. ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌.

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై నేడు విచారణ. కవిత తరుఫున వాదనలు వినిపించిన విక్రమ్‌ చౌదరి. నేడు కౌంటర్‌ వాదనలు వినిపించనున్న ఈడీ, సీబీఐ. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ హైకోర్టులో విచారణ.

ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. పోలింగ్‌కు ముందు, తర్వాత నమోదైన 3 కేసులపై హైకోర్టుకు పిన్నెల్లి. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లికి జూన్‌ 6 వరకు హైకోర్టు ముందస్తు బెయిల్‌.

తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,710 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.97,500 లుగా ఉంది.

నేడు నింగిలోకి ప్రైవేట్‌ రాకెట్‌ అగ్నిబాణ్‌. శ్రీహరి కోటలోని షార్‌ నుంచి రాకెట్‌ ప్రయోగం. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌.

విజయవాడ : సీఎం జగన్‌పై దాడి కేసు. నిందితుడు సతీష్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన విచారణ. నేడు ఆర్డర్స్‌ ఇవ్వనున్న సెషన్స్‌ కోర్టు. సీఎం జగన్‌ఫై దాడి కేసులో ఏ1గా ఉన్న సతీష్‌.

 

 

Show comments